అంతర్జాతీయం

అమెరికాలో కాల్పులు: నలుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్సాస్ సిటీ (అమెరికా), అక్టోబర్ 6: అమెరికాలోని కన్సాస్ సిటీలోని ఒక బార్‌లో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారు జామున 1.30 గంటలకు టెక్విలా కేసీ బార్‌ను సందర్శించినట్టు కేఎస్‌హెచ్‌బీ-టీవీ పేర్కొంది. పోలీసుల కథనం ప్రకారం, ఒక వ్యక్తి బార్‌లోకి ప్రవేశించి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో అయిదుగురిని ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ కాల్పులకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కాల్పులు జరిపింది ఒక్కడేనా, ఎక్కువ మంది ఉన్నారా? అనేది అధికారులకు తెలియరాలేదు. కాల్పులు జరపడానికి కారణమేంటనేది కూడా పోలీసులకు తెలియలేదు. ఈ కాల్పుల సంఘటనపై కన్సాస్‌లోని కన్సాస్ సిటీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా కొంత సమాచారాన్ని మాత్రమే వెల్లడించగలిగారు.