అంతర్జాతీయం

చైనా పర్యాటకుడిని బహిష్కరించిన తైవాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తైపీ, అక్టోబర్ 9: లెన్నాన్ గోడను దెబ్బ తీసినందుకు తైవాన్ ప్రభుత్వం ఒక చైనా పర్యాటకుడిని బహిష్కరించింది. హాంగ్-కాంగ్‌లో ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా, బీజింగ్‌కు చికాకు కల్పించే విధంగా పోస్టర్లను అంటించినందుకు తైవాన్ ఈ నిర్ణయం తీసుకుంది. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఉద్యమకారులు లెన్నన్ గోడలపై రంగు రంగుల గోడ పత్రికలను అంటించారు. పలు నినాదాలతో ఉన్న పోస్టర్లను మొత్తం నగరంలోని గోడలపై అంటించారు. ఎక్కువగా విశ్వవిద్యాలయాల ఆవరణలో ఈ పోస్టర్లు వెలిసా యి. గత నాలుగు నెలలుగా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతున్నది. ఇలాఉండగా చైనాకు చెందిన సందర్శకుడు లీ షాండోంగ్ లెన్నాన్ గోడపై ఉన్న పోస్టర్లను చించి వేయడం, క్రిమినల్ చర్యలకు పాల్పడుతుండడంతో పోలీసులు పెట్టుకున్నారు. దీంతో తైవాన్ ప్రభుత్వం సదరు వ్యక్తిని ఐదేళ్ళ పాటు బహిష్కరించింది.