అంతర్జాతీయం

‘అణు’బంధం పెంచుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియంటియానె, సెప్టెంబర్ 8: ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమై పౌర అణు సహకారాన్ని మరింత బలోపేతం చేయడం, వాతావరణ మార్పు సహా ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో తక్షణ ప్రాధాన్యత అంశాలపై చర్చలు జరిపారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ఈ ఇరువురు నాయకులు లావోస్ రాజధాని వియంటియానెలో సమావేశమయ్యారు. గత రెండేళ్లలో మోదీ ఒబామాను కలవడం ఇది ఎనిమిదోసారి. భారత్-అమెరికా సంబంధాలపై ఒబామాతో గొప్ప చర్చలు జరిపినట్లు సమావేశం అనంతరం మోదీ ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరించడానికి మోదీ తీసుకున్న చర్యలను ఒబామా ప్రశంసించారని ముఖ్యంగా జిఎస్‌టి బిల్లు ఆమోదంతో ఆర్థిక కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నూతన ఆవిష్కరణల విషయంలో మోదీ ఆలోచనలను సమావేశంలో ఒబామా ప్రశంసిస్తూ భారత్‌లాంటి దేశానికి ఇలాంటి ఆలోచనలు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. భారత్‌కు తాను ఎప్పుడూ మిత్రుడినేని, ఇకపై కూడా భారత్‌కు బలమైన భాగస్వామిగా ఉంటానని, తనకు చేతనైన రీతిలో సహాయ పడతానని కూడా ఒబామా అన్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఇరువురు నేతలు వ్యూహాత్మక భాగస్వామ్యంలో తక్షణ ప్రాధాన్యతలను చర్చించారు. వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలు, ఇంధన సహకారంపై చర్చించారని, అలాగే అణు విద్యుత్, సౌర విద్యుత్, నూతన ఆవిష్కరణల రంగాల్లో ఇరుదేశాల సహకారం గురించి కూడా వారు చర్చించినట్లు ఆ వర్గాలు తెలిపారు.
ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడానికి, పరస్పర విశ్వాసం పెంపొందడానికి ఒబామా చేసిన కృషిని మోదీ ప్రశంసించారు. అధ్యక్ష పదవినుంచి వైదొలగిన తర్వాత భారత్ రావలసిందిగా ఆయన ఒబామాను ఆస్వానించారు. దీనిపై ఒబామా స్పందిస్తూ భారత్ సందర్శించడానికి వచ్చే ఏ అవకాశాన్నీ వదులుకోబోనని అన్నారు. అంతేకాదు, తాను, భార్య మిచెల్ ఇప్పటివరకు తాజ్‌మహల్ చూడలేదని కూడా ఆయన చెప్పారు. గత ఏడాది ఒబామా దంపతులు మన దేశానికి వచ్చినప్పుడు తాజ్‌మహల్‌ను సందర్శించాలని అనుకున్నారు. అయితే సౌదీ రాజు అబ్దుల్లా మృతి చెందడంతో ఆయన ఆ పర్యటనను రద్దు చేసుకుని సౌదీ అరేబియా వెళ్లాల్సి వచ్చింది. కాగా, వచ్చే జనవరిలో ఒబామా అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇరు దేశాల నేతలు కలుసుకోవడం ఇదే చివరిసారి. ఒబామా ఆహ్వానంపై 2014లో మోదీ వాషింగ్టన్ డిసి వెళ్లినప్పుడు తొలిసారిగా ఆయన వైట్‌హౌస్‌లో ఒబామాను కలిశారు. గత ఆదివారం చైనాలోని హాంగ్‌ఝౌలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో కూడా ఈ ఇద్దరూ కలిశారు.

చిత్రం.. వియంటియానెలో సమావేశానికి ముందు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కరచాలనం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ