అంతర్జాతీయం

అమెరికాలో బాంబు పేలుళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 18: మరికొన్ని గంటల్లో ఐరాస కీలక భేటీకి వివిధ దేశాల నేతలు రానున్న తరుణంలో అమెరికాలో రెండు బాంబు పేలుడు సంఘటనలతో అట్టుడికింది. వీటిలో ప్రషర్ కుకర్ బాంబు పేలుడు ఘటనలో 29మంది గాయపడ్డారు. మాన్‌హట్టన్‌లోని చెల్సియాలో బాంబు పేలుడు ఘటన జరిగిన కొద్ది వ్యవధిలోనే న్యూయార్క్‌లో ఈ విస్ఫోటనం సంభవించింది. ఈ పేలుడును ఉద్దేశపూర్వక ప్రయత్నంగా న్యూయార్క్ మేయర్ అభివర్ణించారు. దీని ప్రభావం వల్ల సమీపంలోని భవనాల అద్దాలు పగిలిపోయాయని, కార్లూ దెబ్బతిన్నాయని పోలీసులు తెలిపారు. అలాగే భవన శిథిలాలు వీధుల్లోకి వచ్చి పడ్డాయని, ఒక బ్లాక్‌కు బ్లాకే ఊగిపోయిందని వివరించారు. ఇటీవలే 9/11 పదిహేనో వార్షికోత్సవం జరిగిన నేపథ్యంలో ఈ పేలుడు సంభవించడం సర్వత్రా భయాందోళనలకు దారితీసింది.స్థానిక కాలమానం ప్రకారం ఎనిమిదిన్నరుకు జరిగిన ఈ పేలుడుకు పాల్లడింది తామేనని ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియోలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. రెండో బాంబు పేలుడు కూడా సంభవించిందని ఇది ప్రషర్ కుక్కర్ బాంబేదని చెబుతున్నారు. ఈ తరహా బాంబునే 2013లో బోస్టన్ మారథాన్‌లో వినియోగించారని గుర్తు చేశారు. కాగా గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి తీవ్రంగానే ఉందని న్యూయార్క్ మేయర్ బ్లాసియో తెలిపారు. బాంబు పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు.

చిత్రం.. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్న పోలీసులు