అంతర్జాతీయం

వరద నీటిలో మునిగిన జకార్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా: ఇండోనేసియా రాజధాని జకార్తా నగర ప్రజలకు నూతన సంవత్సర ఆరంభ దినం ఎనలేని కష్టాలనే మోసుకొచ్చింది. కుండపోత వర్షాలు కురియడంతో నగరంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో వరదలు ముంచెత్తి తొమ్మిది మంది మృతి చెందారు. బుధవారం నాడు ఏకధారగా కురిసిన వర్షాల కారణంగా 30 మిలియన్ల మంది నివసిస్తున్న గ్రేటర్ జకార్తా నగరంలోని అనేక కాలనీలలో పెద్ద ఎత్తున వరదనీరు చేరుకొని విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నగరంలోని కొన్ని రైలు మార్గాలను, ఒక విమానాశ్రయాన్ని కూడా అధికారులు మూసివేశారు. విద్యుత్ షాక్‌తో ఒక 16 ఏళ్ల బాలుడు మృతి చెందాడని, అల్పశరీరోష్ణత కారణంగా మరో ముగ్గురు మృత్యువాత పడ్డారని జకార్తా డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధిపతి సుబెజో తెలిపారు. వరదలు తగ్గుముఖం పడతాయని, అయితే వర్షాలు ఇలాగే కొనసాగితే మాత్రం వరద నీరు తగ్గబోదని ఆయన పేర్కొన్నారు. ఒక నది పొంగి ప్రవహించడం వల్ల తమ ఇంటిలో నాలుగు మీటర్ల (13 అడుగుల) ఎత్తున వరద నీరు నిలిచిపోయిందని ఒక బాధితుడు చెప్పాడు. ఒక వ్యక్తి వరద నీటిలో మునిగిపోయి మృతి చెందాడు. జకార్తా నగర శివార్లలో మంగళవారం సాయంత్రం కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడి నలుగురు మృతి చెందారు. విద్యుదాఘాతాలను నివారించడానికి అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు అధికారులు చెప్పారు. ప్రస్తుతం ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని వారు పేర్కొన్నారు. 13వేల మంది ప్రజలను వరద ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు వారు చెప్పారు.
'చిత్రం... జకార్తా (ఇండోనేషియా)లో భారీ వరదల కారణంగా మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్న భద్రతా సిబ్బంది