అంతర్జాతీయం

అమెరికాపై ప్రతీకారం తప్పదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, జనవరి 4: అమెరికా జరిపిన లక్ష్యిత దాడికి ప్రతీకారం తీర్చుకుంటానని ఇరాన్ ప్రతిన బూనింది. బాగ్దాద్ విమానాశ్రయానికి సమీపంలో అమెరికా జరిపిన లక్ష్యిత దాడిలో తన టాప్ కమాండర్ ఒకరు మృతి చెందిన నేపథ్యంలో ఇరాన్ బదులు తీర్చుకుంటానని దృఢంగా ప్రకటించింది. లక్ష్యిత దాడి వల్ల ఉద్రిక్తతలు మరింత తీవ్రమయిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి మరికొన్ని వేల బలగాలను పంపిస్తున్నట్టు అమెరికా శుక్రవారం ప్రకటించింది. ఇరాన్‌కు చెందిన ఉన్నత స్థాయి ఖుద్స్ బలగం అధిపతి జనరల్ ఖాసీం సోలేమాని అమెరికా లక్ష్యిత దాడిలో ప్రాణాలు కోల్పోవడం ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలను మరింత తీవ్రం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2015లో ఇరు దేశాల మధ్య కుదిరిన అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించడం, అనంతరం ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించడం వల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి.
అప్పటి నుంచి ఈ ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. సోలేమానిపై దాడి జరిగిన 24 గంటల తరువాత ఇరాక్‌లో మరో భయంకరమయిన వైమానిక దాడి జరిగిందని ఇటు ఇరాక్ అధికారులు, అటు ఇరాన్ మద్దతుతో ఇరాక్‌లో పనిచేస్తున్న మిలీషియాలు ప్రకటించారు. బాగ్దాద్ నగరానికి ఉత్తరాన రెండు వాహనాలపై దాడి జరిగిందని, అయితే ఎంత మంది చనిపోయారనేది ఇంకా తెలియరాలేదని ఇరాక్ అధికారి ఒకరు తెలిపారు. దాడితో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయని, అయిదుగురు మృతి చెందారని మరో భద్రతాధికారి చెప్పారు. ఇరాక్ అధికారిక టెలివిజన్, ఇరాన్ మద్దతున్న పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్ అనే మిలీషియాల మీడియా విభాగం కూడా ఈ దాడి జరిగినట్టు పేర్కొన్నాయి. తమ సాయుధ బలగాలలోని వైద్య బృందాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిగిందని ఈ గ్రూపు ప్రకటించింది. అయితే, ఈ దాడిలో అమెరికా హస్తం ఉందనే వాదనను అమెరికా అధికారి ఒకరు తోసిపుచ్చారు. సోలేమాని మృతితో మొత్తం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాక్, సిరియాలలో అమెరికా బలగాలకు ప్రమాదం మరింత పెరిగింది.
'చిత్రం... ఇరాన్ సైనిక కమాండర్ ఖాసీం సులేమానీ అంత్యక్రియలకు శనివారం బాగ్దాద్‌లో వేల సంఖ్యలో హాజరైన ప్రజలు