అంతర్జాతీయం
ప్రజల అభీష్టానికి వ్యతిరేకం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్‌లోని ప్రతినిధుల సభ (దిగువ సభ)పై ఆధిపత్యం కలిగిన డెమొక్రటిక్ పార్టీకి చెందిన దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా తీసుకొస్తున్న అభిశంసన తీర్మానంలో పస ఏమీ లేదని ఆయన తరఫు లాయర్లు స్పష్టం చేస్తున్నారు. దిగు సభలో డెమోక్రాట్లకు మెజారిటీ ఉండగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన ట్రంప్ సమస్యలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇటీవలే ట్రంప్‌పై అభిశంసన తీర్మాన ప్రక్రియను డెమోక్రాట్లు ప్రారంభించారు. ఇందోలో భాగంలోనే పలు ఆరోపణలతో తీర్మానాన్ని సిద్ధం చేశారు. దీనిని ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టి, అత్యధిక మెజారిటీలో నెగ్గించుకోవాలన్నది వారు ప్రయత్నం. ట్రంప్ తన రాజకీయ ప్రత్యర్థి జో బిడెన్, అతని కుమారుడికి వ్యతిరేకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని డెమొక్రటిక్ పార్టీ ఆరోపిస్తోంది. జో బిడెన్ కుమారుడు ఉక్రెయిన్‌లోని గ్యాస్ కంపనీ బురిస్మాతో కలిసి పనిచేశాడు. జో బిడెన్, అతని కుమారుడు అవినీతికి పాల్పడ్డారన్న నిరాధారమైన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాల్సిందిగా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తేవడానికి ట్రంప్ ప్రయత్నించారని డెమొక్రటిక్ పార్టీ తన ఎనిమిది పేజీలు గల తీర్మానంలో పేర్కొంది. ఇందులోని వివరాలను బహిరంగపరచింది. ‘అధ్యక్షుడు ట్రంప్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడని, అమెరికా ఎన్నికల నిజాయితీతో రాజీ పడటం ద్వారా జాతీయ భద్రతకు ద్రోహం చేశారని వెల్లడించే ఆధారాలు పెరుగుతున్నాయి’ అని రూల్స్ కమిటీ చైర్మన్ జేమ్స్ పీ మెక్‌గోవర్న్ తెలిపారు. ‘హౌస్ ఇంపీచ్‌మెంట్ ఇంక్వైరీ విస్తృతమైన ఆధారాలను, వాంగ్మూలాలను సేకరించింది. త్వరలోనే అమెరికా ప్రజలు సాక్షుల నోటినుంచే వాటిని వింటారు. తీర్మానాన్ని ఈరోజే సభలో ప్రవేశపెట్టడం జరిగింది. రూల్స్ కమిటీ దానిని ముందుకు తీసికెళ్తుంది’ అని నాలుగు హౌస్ కమిటీల అధినేతలు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలావుండగా, డెమొక్రటిక్ పార్టీ చర్యపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. డెమొక్రాట్ల తీర్మానం అక్రమమైందని, కపటమైందని అభివర్ణించింది. ట్రంప్ తరఫు లాయర్లు కూడా తీవ్రంగా స్పందించారు. 2016 ఎన్నికల్లో ప్రజలు ట్రంప్‌ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని, వారి నిర్ణయాన్ని హేళన చేసే రీతిలో డెమోక్రాట్లు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తద్వారా అధ్యక్ష ఎన్నిల్లో లబ్ధి పొందాలన్నది డెమోక్రాట్ల వ్యూహంగా కనిపిస్తున్నదని అన్నారు. ట్రంప్‌ను అధికారం నుంచి తొలగించడం ద్వారా తామ ఏకపక్ష ఎజెండాను దేశంలో అమలు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును అవహేళన చేసే రీతిలో డెమోక్రాట్లు వ్యవహరించడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు.
సెనెట్‌కు అభిశంసన తీర్మానం!
డెమోక్రాట్ల బలం ఎక్కువగా ఉన్న ప్రతినిధుల సభ ట్రంప్‌పై తీర్మానాన్ని 228-193 ఓట్ల తేడాతో ఆమోదించింది. అంతేగాక, దానిని సెనెట్‌కు పంపాలని తీర్మానించింది. అంతేగాక అభిశంసన తీర్మానంపై ఏడుగురు మేనేజర్లను నియమించింది. ట్రంప్‌ను ఎందుకు తొలగించాలి? ఆయనపై ఉన్న ఆరోపణలు ఏమిటి? దేశానికి ఆయన వల్ల కలిగిన నష్టం ఏమిటి? అనే అంశాలను వారు సెనెట్ దృష్టికి తెస్తారు. ఒక రకంగా చెప్పాలంటే, మేనేజర్లుగా నియమితులైన ఆడం షిఫ్, జెరాల్డ్ నాల్డర్, జో లాఫ్‌గ్రెన్, హకీమ్ జెఫ్రీస్, వాల్ డెమింగ్స్, జాసన్ క్రో, సిల్వియా గార్సియా సెనెట్‌లో వారు డెమోక్రాట్ల తరఫున వాదిస్తారు. ట్రంప్‌ను అధికార పీఠం నుంచి తొలగించేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తారు. అయతే, ట్రంప్ తరఫు లాయర్లు ఈ తీర్మానంలో ఉన్న అంశాలన్నీ తప్పులతడకలేనని కొట్టి పారేశారు. వీటిలో ఏ ఒక్క ఆరోపణకు కూడా సాక్ష్యాధారాలు లేవని వ్యాఖ్యానించారు. ట్రంప్‌పై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం రాజకీయ దురుద్దేశంతో కూడుకున్న చర్య మాత్రమేనని, ఇందులో ఎలాంటి ప్రత్యేకత లేదని అన్నారు. సెనెట్‌లో ట్రంప్‌కు అనుకూలంగానే తీర్మానాన్ని ఆమోదిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
'చిత్రం... సెనెట్‌లో వాదనకు సిద్ధంగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ తరఫు లాయర్లు