అంతర్జాతీయం

సీఏఏ వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జనవరి 30: భారత్‌కు చెందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా తన సభ్యులు ప్రవేశపెట్టిన అయిదు వేర్వేరు తీర్మానాలపై సంయుక్తంగా ఓటింగు నిర్వహించడాన్ని యూరోపియన్ పార్లమెంటు మార్చి వరకు వాయిదా వేసింది. బ్రస్సెల్స్‌లో జరిగిన ప్లీనరీ సెషన్‌లో యూరోపియన్ పార్లమెంటు వీటిపై చర్చించింది. యూరోపియన్ కమిషన్ వైస్-ప్రెసిడెంట్, యూరోపియన్ యూనియన్ విదేశీ వ్యవహారాలు, భద్రతా విధానం హై రిప్రజెంటేటివ్ హెలెనా డల్లి చేసిన ప్రకటనతో బుధవారం సీఏఏపై చర్చ మొదలయింది. భారత్‌తో యూరోపియన్ యూనియన్‌కు సుసంపన్నమయిన, పారదర్శకమయిన, నిష్కపటమయిన సంబంధాలు ఉండాలని డల్లి తన ప్రసంగంలో కోరారు. సీఏఏ భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఉందా? లేదా? అనే దానిని నిర్ధారించవలసిన బాధ్యత భారతదేశ సుప్రీంకోర్టుపై ఉందని తాము విశ్వసిస్తున్నామని, భారత్‌లో గత కొన్ని వారాలుగా సీఏఏకు వ్యతిరేకంగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హింసను ప్రస్తుతం కొనసాగుతున్న న్యాయవిచారణ ప్రక్రియ శాంతింపచేస్తుందనే విశ్వాసం తమకు ఉందని డల్లి పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 15వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు మార్చిలో బ్రస్సెల్స్‌కు రానున్నారని పేర్కొంటూ ఆయన రాకకోసం కమిషన్ ఎదురుచూస్తోందని డల్లి పేర్కొన్నారు. గౌరవప్రదమయిన ప్రజాస్వామ్య దేశంగా, ఈయూకు విలువయిన భాగస్వామిగా భారత్‌తో చర్చలు కొనసాగిస్తామని, వాటిని మరింత తీవ్రం చేస్తామనే సందేశమిస్తూ ఆమె యూరోపియన్ పార్లమెంటులో చర్చను ముగించారు.