అంతర్జాతీయం

రాణిస్తున్న వర్శిటీలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, సెప్టెంబర్ 22: అంతర్జాతీయ ఉన్నత విద్యా రంగంలో మన దేశం తన స్థానాన్ని గణనీయంగా మెరుగుపర్చుకుంది. ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన జాబితాలో రికార్డు స్థాయిలో మన దేశానికి చెందిన 31 విద్యా సంస్థలకు చోటు లభించింది. కాగా, ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2016-17’లో చోటు సంపాదించుకున్న బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైనె్సస్ (ఐఐఎస్‌సి) గత ఏడాదికన్నా 50 స్థానాలు మెరుగుపర్చుకుంది. అయితే టాప్ 400 యూనివర్శిటీల జాబితాలో రెండు భారతీయ యూనివర్శిటీలకు మాత్రమే చోటు లభించింది. గత ఏడాది 251-300 గ్రూపులో చోటు సంపాదించుకున్న ఐఐఎస్‌సి ఈ సారి తాజా జాబితాలో 201-250 గ్రూపులో చోటు సంపాదించుకుంది. అలాగే ఐఐటి బాంబే 351-400 గ్రూపులో చోటు సంపాదించుకుంది. అయితే టాప్- 200 జాబితాలో మన దేశానికి చెందిన ఏ యూనివర్శిటీకి చోటు లభించక పోవడం గమనార్హం.
14 కొత్త సంస్థలకు చోటు లభించిన ఈ జాబితాలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ అగ్రస్థానంలో నిలిచింది. 12 ఏళ్ల చరిత్రలో బ్రిటన్‌కు చెందిన ఒక యూనివర్శిటీ ఈ ఘనతను దక్కించుకోవడం ఇదే మొదటిసారి. కాగా, అయిదేళ్ల పాటు అగ్రస్థానంలో నిలిచిన కాలిఫోర్నియా యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ ఈసారి రెండో స్థానంలో నిలవగా, స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది జాబితాలో దక్షిణాసియా ప్రాతినిధ్యం దాదాపు రెట్టిపయింది. గత ఏడాది 20 యూనివర్శిటీలకు ప్రాతినిధ్యం లభించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 39కి పెరిగింది. తొలిసారిగా శ్రీలంకకు ఈ జాబితాలో చోటు దక్డం గమనార్హం. యూనివర్శిటీ ఆఫ్ కొలంబో 800 ప్లస్ గ్రూపులో స్థానం సంపాదించుకుంది. కాగా, 980 యూనివర్శిటీలతో కూడిన ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఇతర భారతీయ విద్యా సంస్థల్లో ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాసు 401-500 గ్రూపులో ఉండగా ఐఐటి ఖరగ్‌పూర్, ఐఐటి రూర్కీ 501-600 గ్రూపులో స్థానం సంపాదించుకున్నాయి.

బెంగళూరు ఐఐఎస్‌సి (ఫైల్ ఫొటో)