అంతర్జాతీయం
వర్జీనియాలో ఆంధ్ర అమ్మాయి పోటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాషింగ్టన్: వర్జినియా నుంచి రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నట్లు ఆంధ్ర ప్రదేశ్‌లో జన్మించిన మంగ అనంతమూల ప్రకటించారు. లీగ్ స్కూళ్ళలో అడ్మిషన్ల విషయంలో ఆసియా దేశస్థుల పట్ల వివక్ష కనబరుస్తున్నారని చెప్పడం ద్వారా వార్తల్లోకి ఎక్కిన మంగ ‘అమెరికాలోని హిందువుల తరఫున నా గళాన్ని గట్టిగా వినిపిస్తాను..’ అని తెలిపారు. రక్షణ పరికరాల సేకరణలో ఫెడరల్ ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేసిన మంగ పోటీకి రిపబ్లికన్ పార్టీ నుంచి సంకేత ప్రాయంగా ఆమోదం లభించింది. దీంతో వర్జినియా నుంచి పోటీ చేస్తున్న తొలి భారత సంతతికి చెందిన మహిళగా ఆమె గుర్తింపు పొందుతున్నారు. వర్జినియా ప్రాంతం ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి కంచుకోట అయినప్పటికీ ఇక్కడ ఇండో-అమెరికన్లు ఆసియన్ అమెరికన్లు సహా 17 శాతం మంది ఆసియా సంతతికి చెందిన వారే నివసిస్తున్నారు. సాధారణంగా ఇక్కడ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థికే ఓటర్లు మొగ్గు చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన మంగ అనంతమూలకు దక్కడం అమనార్హం. పరిస్థితి ప్రతికూలంగా ఉన్నా నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ప్రస్తుత ప్రతినిధి జర్రీ కోనొల్లిని ఓడించగలనన్న నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేశారు. గత ఆరు దఫాలుగా ఈ ప్రాంతానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ రావడం గమనార్హం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల కారణంగా అనేక మంది డెమోక్రటిక్ మద్దతుదారులు రిపబ్లికన్ పార్టీ పట్ల మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు వీరిని ఆకర్షిస్తున్నాయని ఆమె తెలిపారు.