అంతర్జాతీయం
భారత్,అమెరికా బంధం దృఢమైంది
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య సంబంధాలు దృఢమయినవని అమెరికాకు చెందిన ఒక ఉన్నత స్థాయి దౌత్యవేత్త పేర్కొన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలలో భారత్‌లో అధికారికంగా పర్యటిస్తున్నారు. భారత్‌తో ఆత్మీయ సంబంధాలను మరింత ముందుకు తీసికెళ్లాలని ట్రంప్ పాలనా యంత్రాంగం భావిస్తోందని అమెరికా విదేశాంగ శాఖలో దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల బాధ్యతలు నిర్వహిస్తున్న అసిస్టెంట్ సెక్రెటరి అలైస్ వెల్స్ పేర్కొన్నారు. ట్రంప్ ఫిబ్రవరి 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ‘మా రెండు దేశాల మధ్య సంబంధాలు దృఢమయినవి. మరింత ఆత్మీయమయిన సంబంధాలను నెలకొల్పుకోవడానికి మేము చూస్తున్నాం’ అని అలైస్ వెల్స్ శనివారం నాడిక్కడ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఒక సందేశంలో పేర్కొన్నారు. ‘్భరత్, అమెరికా మధ్య సన్నిహత భాగస్వామ్యం ఉంది. అది రోజురోజుకు దృఢమవుతోంది. మేము కలిసి రికార్డులను ఛేదిస్తున్నాం. ఉదాహరణకు, గత సంవత్సరం మేము భారత్‌కు చెందిన అనేక మంది విద్యార్థులకు అమెరికాలో చదువుకునేందుకు అవకాశం కల్పించాం. ఈ సంవత్సరం ఎక్కువ మందికి అవకాశం కల్పిస్తామనే విశ్వాసం ఉంది’ అని ఆమె అన్నారు. భారత్ ఇండో-పసిఫిక్ రీజియన్‌లో హృదయ భాగంలో ఉందని, ప్రపంచ వేదికపై అంతకంతకూ పెరుగుతున్న ప్రాధాన్యమయిన పాత్రను పోషిస్తోందని ఆమె పేర్కొన్నారు. భారత్‌తో ప్రతి అడుగులోనూ కలిసి నడవాలని అమెరికా కోరుకుంటోందని ఆమె అన్నారు.