అంతర్జాతీయం

యూఎన్ తీర్మానానికి సహకరించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఫిబ్రవరి 19: యుద్ధ నేరాల జవాబుదారీతనానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీర్మానానికి సహకరించే అంశం నుంచి శ్రీలంక వైదొలుగుతోందని ఆ దేశ ప్రధాన మంత్రి మహీంద రాజపక్సే బుధవారం ఇక్కడ ప్రకటించారు. శ్రీలంకలో 2009లో జరిగిన పౌరయుద్ధంలో మానవ హక్కులను ఉల్లంఘించారంటూ తమ దేశ ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ షవేంద్రసిల్వా, ఆయన కుటుంబ విదేశీ ప్రయాణాలపై ఇటీవల అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో రాజపక్సే ఈ సంచలన ప్రకటన చేశారు. ఐక్యరాజ్యసమితి తీర్మానం 30/1కు సహకరించే అంశం నుంచి లంక ప్రభుత్వం వైదొలుగుతోందని ఒక ప్రకటనలో రాజపక్స వెల్లడించారు. 2015లో అప్పటి లంక ప్రభుత్వం యుద్ధ నేరాల హక్కుల ఉల్లంఘనలో సయోధ్యకు సంబంధించి 30/1 తీర్మానానికి సహకరించేందుకు ఒప్పందం చేసుకొంది. అప్పటి ప్రభుత్వం చేసిన నిర్వాకం కారణంగా ప్రపంచ దేశాలన్నీ తమ దేశ భద్రతా దళాలు హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతాయంటూ వేలెత్తి చూపే అవకాశం ఏర్పడిందని ఆరోపించారు. కాగా, ఎల్‌టీటీఈతో జరిగిన పోరాటం సమయంలో రాజపక్స శ్రీలంక అధ్యక్షుడిగా, చీఫ్ కమాండర్‌గా ఉన్నారు. లంక భద్రతా దళాలు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయన్న కోణంలోనే నాడు ఐక్యరాజ్యసమితి తీర్మానంతో సహకరించడానికి కారణం అని రాజపక్స ప్రకటనను బట్టి తెలుస్తోంది. కాగా, తమ దేశ లెఫ్టినెంట్ జనరల్ సిల్వా విదేశీ పర్యటనలకు సంబంధించి అమెరికా ఆంక్షలు విధించడాన్ని ఇటు లంకలోని ప్రభుత్వంలో ఉన్న అధికార, ప్రతిపక్ష నేతలు సైతం ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. ఒక ఉగ్రవాద సంస్థ అయిన ఎల్‌టీటీఈపై యుద్ధం జరిపిన వ్యక్తి లెఫ్టినెంట్ జనరల్ సిల్వా అని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి దినేష్ గుణవర్దనే ఇటీవల పేర్కొన్నారు.
*చిత్రం... శ్రీలంక ప్రధాని మహేంద రాజపక్సే