అంతర్జాతీయం

కోవిడ్-19పై ‘ఏసియాన్’ యుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వియేనె్షన్(లావోస్): ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వైరస్ మహమ్మారి ముప్పునుంచి బయటపడేందుకు చైనా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో భాగంగా చైనా దౌత్యవేత్తల బృందం బుధవారం లావోస్ చేసుకుని ఆగ్నేయాసియా దేశాలతో సమావేశమయ్యారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి ఆదేశాల ప్రతినిధులతో విందు సమావేశం ఏర్పాటు చేసి కరోనాపై విస్తృతంగా చర్చించారు. లావోస్ రాజధాని వియేనె్షన్‌లో సహచర దేశాలతో ఆయన భేటీ అయ్యారు. పది దేశాల కూటమిలోని ఆరు దేశాల్లో కోవిడ్-19 వైరస్ జాడలు కనిపించాయి. ‘ఏసియాన్’ బ్లాక్ దేశాల్లోని 600 మిలియన్ల మంది ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చైనా, ఐరాస విడివిడిగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. పలు దీర్ఘకాలిక సమస్యలపైనే చర్చలు జరపాలని నిర్ణయించాయి. పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత అంశాలపై దృష్టిసారించారు. కోవిడ్-19 వైరస్ పుణ్యమాని ఏసియాన్ దేశాలకు తీవ్రమైన ఆర్థిక నష్టం వాటిల్లింది. పర్యాటనలపై ఆంక్షలు, కొన్నింటిపై కఠినమైన నిర్ణయాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లింది. మధ్య చైనాలోని వూహన్ నగరంలో బయటపడిన వైరస్ ప్రపంచానే్న వణికిస్తోంది. ఇప్పటికే 70 వేల మంది వైరస్ బారిన పడ్డారు. సుమారు 2000 మంది చనిపోయారు. మృతుల్లో అత్యధికం చైనాలోనే కావడం గమనార్హం. కోవిడ్-19 వైరస్‌ను ఏసియాన్ దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. ఇటీవల ఓ సంయుక్త ప్రకటనలో వైరస్ వ్యాప్తిపే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సకాలంలో పరస్పరం సహకరించుకోవడం ద్వారా కోవిడ్-19ను కట్టడి చేయాలని సభ్య దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ప్రజల ప్రాణాలకు ముప్పుతోపాటు అభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగించే వైరస్‌ను ఎలా ఎదుర్కోవాలి అన్నదానిపై ఏసియాన్ దేశాలు తర్జన భర్జన పడుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) ఇప్పటికే తన ప్రయత్నాలు ప్రారంభించింది. ఆసియన్ కూటమిని అప్రమత్తం చేసింది. కూటమి దేశాలు పొరుగుదేశాలతో పరస్పర సహకారం అందించుకోవాలని, వైరస్ మరింత విస్తరించకుండా చూడాలని సంస్థ హెచ్చరించింది. ఎంట్రీ పాయింట్ల వద్య విధిగా వైద్య పరీక్షలు చేపట్టాలని కోరింది. కంబోడియా నుంచి మలేసియా నౌకలో ప్రయాణించిన ఓ మహిళకు కోవిడ్-19 వైరస్ లక్షణాలు కనిపించాయి. 145 మంది ప్రయాణికుల్లో అమెరికాకు చెందిన ఆమె పరీక్షలు నిర్వహించగా పోజిటీవ్ వచ్చింది. ఇలా ఉండగా ఇండోనేసియా, బ్రూనే, మైన్మార్ దేశాల్లో ఎలాంటి వైరస్ లక్షణాలు కనిపించలేదని లావోస్ వర్గాలు ప్రకటించాయి. మిగతా ఆసియన్ కూటమి దేశాలైన సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా, వియత్నాం, ఫిలిప్పీన్స్, కంబోడియాలో వైరస్ లక్షణాలు కనిపించాయి. చైనాలోని వూహన్ నగరంలో కోవిడ్-19 బయటపడిన తరువాత ఫిలిప్పీన్స్‌లోనే తొలి వైరస్ కేసు నమోదైంది.