అంతర్జాతీయం

ఢిల్లీ అల్లర్లు ఆపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా: భారత ప్రభుత్వం చేపట్టిన పౌరసత్వ సవరణ చట్టం.. అలాగే, దానిపై జరుగుతున్న హింసాకాండ పట్ల ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంఘం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీలో మతపరమైన దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టేందుకు పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోలేదన్న కథనాలపై తీవ్రంగా స్పందించింది. తక్షణమే రాజకీయ పార్టీల నేతలు జోక్యం చేసుకొని పరిస్థితులను అదుపు చేయాలని ఐక్యరాజ్య సమితి మానవహక్కుల హై కమిషనర్ నిఖెల్ బాష్‌లెట్ పిలుపునిచ్చారు. మానవ హక్కుల మండలి 43వ సమావేశంలో మాట్లాడిన ఆమె.. ఢిల్లీ అల్లర్లతో పాటు జమ్మూ కాశ్మీర్ పరిస్థితి గురించి కూడా ప్రస్తావించారు. గత ఏడాది భారత ప్రభుత్వం చేపట్టిన పౌర చట్టంలోని అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయని.. ఈ చట్టాన్ని భారత్‌లోని అనేక వర్గాలు తీవ్రంగానే ప్రతిఘటిస్తున్నాయని ఆమె అన్నారు. ముఖ్యంగా ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు మితిమీరిన స్థాయిలో బలప్రయోగానికి దిగడం ఎంతమాత్రం సముచితం కాదన్నారు.
ఈ రకమైన పరిస్థితి మత ఘర్షణలకు దారి తీస్తున్నాయనీ.. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే 34మంది మరణించారని తెలిపారు.