అంతర్జాతీయం

తాలిబన్లతో అమెరికా ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, ఫిబ్రవరి 29: అఫ్గానిస్తాన్‌లో శాంతిని నెలకొల్పే దిశగా ఒక అడుగు పడింది. అఫ్గానిస్తాన్ భవిష్యత్తును నిర్ణయించే ఒక చరిత్రాత్మక ఒప్పందాన్ని అమెరికా శనివారం తాలిబన్లతో కుదుర్చుకుంది. అత్యంత దీర్ఘకాలికంగా సాగుతున్న అఫ్గానిస్తాన్ యుద్ధం నుంచి వైదొలగాలని కోరుకుంటున్న అమెరికా అందుకు అనుగుణంగా అఫ్గానిస్తాన్ నుంచి 14 నెలలలోపు తన బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవడానికి
సంబంధించిన కాలనిర్ణయ పట్టికకు ఈ ఒప్పందంలో భాగంగా తుదిరూపం ఇచ్చింది. ఈ చరిత్రాత్మక ఒప్పందం వల్ల తాలిబన్లకు, అఫ్గానిస్తాన్ ప్రభుత్వానికి మధ్య చర్చలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ చర్చలు సఫలమయితే, 18 ఏళ్లుగా సాగుతున్న యుద్ధానికి తెరపడుతుంది. దోహాలోని ఒక విలాసవంతమయిన హోటల్‌లో గల కాన్ఫరెన్స్ హాలులో తాలిబన్ నాయకుడు ముల్లా బరదార్, అమెరికా చీఫ్ నెగోషియేటర్ జాల్మే ఖలీల్‌జాద్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అనంతరం వీరిద్దరు పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ హాలులో ఉన్న వారంతా ‘అల్లాహు అక్బర్’ (దేవుడు అందరికన్నా గొప్పవాడు) అంటూ నినదించారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పోంపియో సమక్షంలో ఈ ఒప్పందంపై బరదార్, ఖలీల్‌జాద్ సంతకాలు చేశారు. అంతకు ముందు మైక్ పోంపియో తాలిబన్లను ఉద్దేశించి మాట్లాడుతూ ‘అల్‌ఖైదాతో సంబంధాలను తెంపుకుంటామని ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోవాలి’ అని కోరారు. ఈ ఒప్పందం కుదరనున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త భవిష్యత్తు కోసం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అఫ్గానిస్తాన్ ప్రజలకు పిలుపునిచ్చారు. తాలిబన్లు ఒప్పందంలోని అంశాలకు కట్టుబడి ఉంటే, అమెరికా, దాని మిత్రదేశాలు 14 నెలలలోపు అఫ్గానిస్తాన్ నుంచి తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకుంటాయి. ఇందులో భాగంగా శనివారం నుంచి తొలి 135 రోజులలోగా అఫ్గానిస్తాన్‌లో తమ బలగాలను 8,600కు తగ్గించుకుంటాయి. నాటో సెక్రెటరి జనరల్ జెన్స్ స్టోల్‌టెన్‌బెర్గ్ ఈ ఒప్పందాన్ని ‘శాంతికి తొలి అడుగు’గా అభివర్ణించారు.

*చిత్రం...చారిత్రక శాంతి ఒప్పందం అనంతరం కరచాలనం చేస్తున్న అమెరికా ప్రతినిధి జాల్మె ఖలీల్ జాద్, తాలిబన్ సహ సంస్థాపకుడు ముల్లే అబ్దుల్ ఘనీ