అంతర్జాతీయం

ఆదిలోనే హంసపాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, మార్చి 1: అఫ్గానిస్తాన్-తాలిబన్ ప్రభుత్వాల మధ్య శాంతి చర్చలకు దోహదం చేస్తూ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే తొలి అవరోధాల సంకేతాలు తలెత్తాయి. వచ్చే వారం జరుగనున్న కీలక చర్చల్లోగానే తాలిబన్ ఖైదీలను తాము విడుదల చేసేది లేదని అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అస్రాఫ్ ఘనీ ఆదివారంనాడు ఇక్కడ ప్రకటించారు. ఇంత త్వరితగతిన ఖైదీలను విడుదల చేయాలని తమపై ఒత్తిడి తేవడం పట్ల ఆయన బాహాటంగానే అసమ్మతిని వ్యక్తం చేశారు. ఈనెల 10న చర్చలు మొదలయ్యే లోగానే 5వేల మంది తాలిబన్ ఖైదీలను అఫ్గాన్ ప్రభుత్వం విడుదల చేయాలని ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇతరత్రా తాలిబన్లకు అమెరికా ఎలాంటి హామీలిచ్చినా ఖైదీలను విడుదల చేయాలన్నది దాని పరిధిలో లేని అంశమని ఘనీ తెలిపారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సింది తమ ప్రభుత్వమేనని, నార్వే రాజధాని ఓస్లోలో శాంతి చర్చలు మొదలయ్యే లోగానే తాలిబన్ ఖైదీలను విడుదల చేయడానికి తాము సిద్ధంగా లేమని ఆయన తెగేసి చెప్పారు. ఖైదీల విడుదల అన్నది చర్చల్లో భాగం కావాలి తప్ప వాటి ప్రారంభానికి ముందస్తు షరతు కాకూడదని ఆయన స్పష్టం చేశారు.