అంతర్జాతీయం

వైరస్ ఉన్నా..ఆగని మహిళా మార్చ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్యాంకాక్: కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆసియా ఖండంలో వివిధ కార్యక్రమాలు రద్దయినప్పటికీ, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఖండంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం వేలాది మంది వీధుల్లోకి వచ్చారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 3,500కు పైగా మందిని బలిగొన్న, లక్షకు పైగా మందికి సోకిన కరోనా వైరస్‌కు కేంద్ర బిందువుగా ఉన్న చైనాలో అధికార ప్రసార సాధనం సీసీటీవీ ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో మహిళా వైద్య సిబ్బంది ముందు పీఠిన నిలిచారని ప్రశంసించింది. థాయిలాండ్, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్న ప్రదర్శనలు ముందుకు సాగాయి. మత ఛాందసవాద పాకిస్తాన్‌లో తమకు ‘స్వేచ్ఛ’ కావాలంటూ మహిళలు ర్యాలీ తీశారు. భారత్‌లో ఒక మహిళా మారథాన్‌ను నిర్వహించాలని ప్రణాళిక రూపొందించినప్పటికి కరోనా వైరస్ భయాల కారణంగా దాన్ని వాయిదా వేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రముఖ మహిళలు తన సామాజిక మాధ్యమం ఖాతాలను నడుపుతారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. చైనా తరువాత అత్యధికంగా 7,000కు పైగా మందికి కరోనా వైరస్ సోకిన దక్షిణ కొరియాలో అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. ‘మనం భౌతికంగా కలవలేకపోయినప్పటికీ, మన మనసులు లింగ సమానత్వం కోసం ఎప్పటికన్నా కూడా దృఢంగా ఉన్నాయి’ అని దేశ లింగ సమానత్వ శాఖ మంత్రి లీ జుంగ్ -ఓకే పేర్కొన్నారు. అనేక స్ర్తివాద సంస్థలు వీధి ప్రదర్శనలు నిర్వహించడానికి బదులు ఈసారి లింగ సమానత్వంపై ప్రజలను చైతన్యపరచడానికి ఆన్‌లైన్‌లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాయి. బ్యాంకాక్‌లో కరోనా వైరస్ నేపథ్యంలో ఉద్యోగుల రక్షణను పెంపొందించడానికి ఆందోళనకారులు పిలుపునిచ్చారు. అయితే, క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఈ ప్రదర్శనల్లో తక్కువ మంది మహిళలు పాల్గొన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో వందలాది మంది మహిషలు, పురుషులు ర్యాలీలో పాల్గొన్నారు.