అంతర్జాతీయం

బ్రిటిష్ వైద్య మంత్రికి కరోనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 11: బ్రిటిష్ పార్లమెంటు సభ్యురాలు, వైద్య శాఖ మంత్రి నదీన్ డోరీస్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. ‘నాకు కరోనా వైరస్ ఉన్నట్టు వైద్య పరీక్షల్లో స్పష్టమైంది. కాబట్టి నా అంతట నేనే ఇంట్లో ఎవర్నీ కలవకుండా ఒంటరిగా ఉంటున్నాను’ అని ఈ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఈమెకు కరోనా వైరస్ ఎలా సోకింది, ఎవరెవరిని ఈమె కలిశారు అనే అంశాలపై బ్రిటీష్ ఆరోగ్య శాఖ అధికారులు దృష్టి సారించారు. విధి నిర్వహణలో భాగంగా మంత్రి డోరీస్ ఎంతోమందిని కలవాల్సి ఉంటుంది. వారిలో ఎవరి నుంచి ఆమెకు కరోనా వైరస్ సోకిందన్నది తెలియరావడం లేదు. ఈ వైరస్ సోకిన తొలి బ్రిటీష్ మంత్రి ఆమే కావడం గమనార్హం. కాగా, ఈ అంశాన్ని ప్రధాని బోరిస్ జాన్సన్‌తోపాటు ఆయన కేబినెట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ఆమెకు సత్వర చికిత్స అందించడంతోపాటు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది. బ్రిటన్‌లో ఇంతవరకు 373 మందికి కరోనా వైరస్ సోకింది. ఆరుగురు మృతి చెందారు.
*చిత్రం... బ్రిటిష్ పార్లమెంటు సభ్యురాలు, వైద్య శాఖ మంత్రి నదీన్ డోరీస్‌కు కరోనా