అంతర్జాతీయం

మాస్కుల ఎగుమతికి అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెరూసలెం: భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు మాస్కులు, ఔషధాల తయారీకి ఉపయోగించే ముడి సరుకుల ఎగుమతికి ఆమోదం తెలపాలని, అనుమతించాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరినట్టు ఒక మీడియా కథనం వెల్లడించింది. నెతన్యాహు ఈ వారంలో మోదీతో జరిపిన టెలిఫోన్ సంభాషణలో ఈ విజ్ఞప్తి చేసినట్టు ఇజ్రాయెల్‌కు చెందిన ‘చానల్ 13’ శుక్రవారం నాడు పేర్కొంది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకొని భారత్ ఈ సరుకుల ఎగుమతిని నిలిపివేయాలని నిర్ణయించిన తరువాత నెతన్యాహు ఈ విజ్ఞప్తి చేశారని ‘చానల్ 13’ వివరించింది.