అంతర్జాతీయం

ఒక్కరోజులోనే 1,500 కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాడ్రిడ్: కరోనా వైరస్ గుప్పిట చిక్కిన స్పెయిన్‌లో కేవలం 24 గంటల్లోనే 1,500కు పైగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ కేసుల మొత్తం సంఖ్య 5,763కు పెరిగింది. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన నిధుల సమీకరణలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఇప్పటికే ఈ వైరస్ వల్ల 136 మంది మరణించడంతో దేశ ప్రధాని ఫెడ్రో శాంచెజ్ జాతినుద్దేశించి ప్రకటించే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా మరింతగా కట్టుదిట్టమైన ఆంక్షలను ఆయన ప్రకటించబోతున్నట్టు చెబుతున్నారు. దేశ పౌరుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు అసాధారణ రీతిలోనే ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకుంది. బార్లు, రెస్టారెంట్లను ఇప్పటికే మూసేసింది. అన్ని రకాల క్రీడలను నిలిపివేసింది. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కూడా తాళాలు వేసింది. దేశ రాజధాని మాడ్రిడ్‌లో అత్యవసరం కాని వ్యాపారాలన్నింటినీ మూసివేశారు.