అంతర్జాతీయం
ఏకాంతంలో వారాంతం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రోమ్, మార్చి 14: శనివారం వచ్చిందంటే ఇటలీ జనమంతా వీధుల్లోనే. వారాంతపు ఆనందోత్సాహాలను అంతగా అక్కడి ప్రజలు జరుపుకుంటారు. కానీ ప్రాణాంతక కరోనా వైరస్ ఇటలీని ఇంటికే పరిమితం చేసింది. ఖాళీ రోడ్లు, మూసేసిన దుకాణాలు, భయానక నిర్మానుష్యం, నిశ్శబ్దం ఈ వారాంతంలో ఇటలీని అలుముకున్నాయి. దేశంలో ఈ వైరస్ వ్యాప్తి అత్యంత తీవ్రంగా ఉండడంతో ఇటలీ ప్రభుత్వం తీవ్ర చర్యలను చేపట్టింది. కేసుల సంఖ్య 17 వేలు దాటి 1,200 మందికి పైగా మరణించడంతో ప్రజలంతా ఇళ్ళల్లోనే ఉండాలని, గడప దాటి రావద్దని ఆదేశించింది. సోమవారం నుంచి ఇటలీలో ఏ ఒక్కరు కూడా బయటకు వచ్చిన పాపాన పోలేదు. వారాంతం కూడా కరోనా భయం నీడలోనే. బయటకు వస్తే ఎక్కడ వైరస్ సోకుతుందనే గుబులుతోనే సాగింది.
అయితే, ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల ఆర్థిక వ్యవస్థ చతికిలపడే పరిస్థితి తలెత్తడంతో ఈ ఆంక్షలను కొంతమేర సడలించే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. రుణాల చెల్లింపు, పన్నుల చెల్లింపు డెడ్‌లైన్‌లను తొలగించడంతోపాటు ఏకాంత వాసాన్ని సిక్ లీవ్‌గా పరిగణించే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.