అంతర్జాతీయం

అమెరికాలో జాతీయ ఎమర్జన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా మహమ్మారి ముదిరిపోవడంతో అమెరికా ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. 46 రాష్ట్రాలకు విస్తరించిన ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతీయ ఎమర్జన్సీ ప్రకటించారు. ఇప్పటికే అమెరికాలో 40 మందిని ఈ వైరస్ బలిగొంది. దేశవ్యాప్తంగా 2వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ‘పరిస్థితి మరింతగా క్షీణించే ప్రభావం కనిపిస్తోంది. రానున్న ఎనిమిది వారాలు అత్యంత కీలకం’ అని వైట్ హౌస్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ ప్రకటించారు. ఈ వైరస్‌ను అణచివేసేందుకు ఫెడరల్ ప్రభుత్వం తన శక్తియుక్తులను అన్నింటినీ వినియోగిస్తుందని, ఇందులో భాగంగా అధికారికంగా జాతీయ ఎమర్జన్సీని ప్రకటించడంతోపాటు 50 బిలియన్ డాలర్ల ఫెడరల్ నిధులను విడుదల చేస్తున్నట్టు ట్రంప్ తెలిపారు. ఈ నిధులతో కరోనా వైరస్‌ను అన్ని కోణాల్లోనూ ఎదుర్కోవడం సాధ్యమవుతుందని తెలిపారు. అమెరికాలో జాతీయ ఎమర్జన్సీని ప్రకటించడం అన్నది చాలా అరుదుగా జరుగుతుంది. దీనివల్ల జాతీయ స్థాయిలో ఈ వైరస్‌ను ఎదుర్కోవడంతోపాటు రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు కూడా నిధులను సమకూర్చడం సాధ్యమవుతుంది. అంటే ఓ సమన్వయ ప్రక్రియగా అత్యున్నత స్థాయి నుంచి అట్టడుగు స్థాయి వరకు పాలనా యంత్రాంగాలన్నీ కలిసి పనిచేయడానికి జాతీయ ఎమర్జన్సీ నిర్ణయం దోహదం చేస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ వెంటనే అత్యవసరం నిర్వహణా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ట్రంప్ ఆదేశించారు. వైరస్ కారణంగా తలెత్తే అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా దేశంలోని ప్రతి ఆసుపత్రి కూడా సర్వసన్నద్ధం కావాలని అన్నారు. ఈ విషయంలో వైద్యులు, ఆసుపత్రులు, హెల్త్‌కేర్ కేంద్రాలకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నామని, పరిస్థితులకు అనుగుణంగా అవి వ్యవహరించవచ్చునని తెలిపారు. అలాగే ప్రైవేటు సంస్థలతో కలిసి ఈ వైరస్ నిరోధనకు కృషి చేస్తామని పేర్కొన్న ట్రంప్ ఎవరికైతే ఈ పరీక్షలు అవసరమో అవి సురక్షితంగా త్వరితగతిన జరిగేలా చూడడం తమ లక్ష్యమని అన్నారు. అయితే, ప్రతిఒక్కరూ ఈ పరీక్షలు చేయించుకోవాల్సిందేనన్న నిర్బంధం లేదని, వైరస్ లక్షణాలు ఉన్నవారు మాత్రమే అవసరాన్ని బట్టి వీటిని చేయించుకోవాలని తెలిపారు. ఇందుకు సంబంధించి అమెరికా ఆహార ఔషధ నిర్వహణ వ్యవస్థ కొత్త పరిశోధనా విధానాన్ని తీసుకువచ్చిందని, వచ్చే వారానికల్లా మరో 5 లక్షలకు పైగా అదనపు పరీక్షలు సిద్ధమవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా అన్ని ఫార్మా సంస్థలతోనూ తాము చర్చలు జరుపుతామని అన్నారు. పౌరులు తమ కార్లను దిగకుండానే ఈ పరీక్షలు చేయించుకునే వీలుంటుందని పేర్కొన్న ఆయన ఈ ప్రాణాంతక వైరస్‌ను ఓడించడానికి ప్రతి అమెరికా పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని అన్నారు.