అంతర్జాతీయం

పాక్‌కు బుద్ధి చెప్పాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, సెప్టెంబర్ 25: భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఆదివారం న్యూయార్క్ చేరుకున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 71వ సమావేశంలో ప్రసంగించడానికి ఆమె ఇక్కడికి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం సుష్మాస్వరాజ్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగిస్తారు. భారత్ అంతర్గత అంశమైన కాశ్మీర్‌పై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె తన ప్రసంగంలో గట్టి సమాధానం ఇస్తారని భావిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 71వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న సుష్మాస్వరాజ్ న్యూయార్క్ చేరుకున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ఒక ట్వీట్‌లో తెలిపారు. నవాజ్ షరీఫ్ ప్రసంగించిన తర్వాత ఆయన ప్రసంగానికి సమాధానమిచ్చే హక్కును ఉపయోగించుకున్న భారత్, పాక్‌ను ఉగ్రవాద దేశంగా పేర్కొనడమేకాక ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంలో భాగంగా చేసుకుని యుద్ధ నేరాలకు పాల్పడుతున్న దేశమని తీవ్రస్వరంతో తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఉగ్రవాదంతోపాటుగా భద్రతా సమితి విస్తరణ, వాతావరణ మార్పులు, ప్రపంచ శాంతి వంటి అంశాలను కూడా సుష్మాస్వరాజ్ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావిస్తారని వికాస్ స్వరూప్ తెలిపారు. సుష్మాస్వరూప్ తన ప్రసంగంలో ఏమి మాట్లాడుతారా అని భారతే కాకుండా ప్రపంచం యావత్తు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. అయితే సుష్మాస్వరాజ్ ప్రసంగం పాఠం వివరాలను మాత్రం ఆయన బయటపెట్టలేదు.

చిత్రం.. ఆదివారం న్యూయార్క్ చేరుకున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్