అంతర్జాతీయం

ప్రజాస్వామ్యం పాక్‌కు సరిపోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 1: పాకిస్తాన్ వాతావరణానికి ప్రజాస్వామ్యం సరిపోదని, అందుకే సైన్యం అక్కడి పరిపాలనలో తరచూ కీలకపాత్ర పోషించాల్సి వస్తోందని ఆ దేశ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ అన్నారు. ‘మాకు స్వాతంత్య్రం వచ్చినప్పటినుంచి కూడా సైన్యానికి ఒక పాత్ర ఉంటోంది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికయినట్లు చెప్పుకొన్న ప్రభుత్వాలన్నీ విఫలమైనాయి కాబట్టి పాకిస్తాన్ పాలనలో అది చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది’ అని వాషింగ్టన్ ఐడియాస్ ఫోరమ్‌లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ముషారఫ్ అన్నారు. పాకిస్తాన్‌కున్న బలహీనత ఏమిటంటే- అక్కడి వాతావరణానికి తగినట్లుగా ప్రజాస్వామ్యం లేకపోవడమేనని అన్నారు. వ్యవస్థలో నియంత్రణలు లేవని, రాజ్యాంగం సైతం వాటిని కల్పించలేదని, అందువల్లనే ఇష్టం ఉన్నా లేకున్నా సైన్యం రంగప్రవేశం చేయాల్సి వస్తోందని అన్నారు. పాకిస్తాన్ ప్రజలు సైన్యాన్ని ప్రేమిస్తారని, వారినుంచి బోలెడు ఆశిస్తారని, సైన్యం తనను సమర్థించినందుకు, 40 ఏళ్లకు పైగా వారితో ఉన్నందుకు తాను గర్విస్తున్నానని ముషారఫ్ అన్నారు. అంతేకాదు, అమెరికా తమ దేశాన్ని తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకుందని కూడా ముషారఫ్ ఆరోపించారు. గతంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా ఉండిన ముషారఫ్ అప్పట్లో పాక్ ప్రధానిగా ఉండిన నవాజ్ షరీఫ్‌ను గద్దె దింపి అధికార పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే.