అంతర్జాతీయం

‘సింధు’ ఒప్పందం రద్దును ‘దురాక్రమణ’గా పరిగణిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 3: సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసుకునేందుకు చేసే ఎటువంటి ప్రయత్నాలనైనా ‘దురాక్రమణ చర్య’గా పరిగణిస్తామని పాకిస్తాన్‌లోని వివిధ రాజకీయ పార్టీల నేతలు సోమవారం భారత్‌ను బెదిరించారు. బలూచిస్తాన్‌లో భారత్ ‘జోక్యాన్ని’ ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో పాకిస్తాన్‌కు చెందిన వివిధ రాజకీయ పార్టీలు, పార్లమెంటరీ పార్టీల నాయకులు ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఎటువంటి కవ్వింపులు లేకుండా భారత్ దురాక్రమణకు పాల్పడుతోందని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘించి ప్రాంతీయ శాంతిభద్రతలకు ముప్పును కలిగిస్తోందని వారు ఆ తీర్మానంలో ఆరోపించారు. ఉరీలో ఉగ్రదాడి అనంతరం పాక్ ఆక్రమిత కాశ్మీరులోని ఉగ్రవాద స్థావరాలపై భారత బలగాలు మెరపు దాడులు నిర్వహించడంతో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి నెలకొన్న పరిస్థితుల గురించి నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన మంత్రివర్గంలోని సీనియర్ సభ్యులు ఈ సమావేశంలో వివరించారు. కాశ్మీరు ప్రజల ఉద్యమాన్ని అణచివేసేందుకు ఉగ్రవాదం పేరుతో భారత్ దారుణమైన అకృత్యాలకు పాల్పడుతోందని, వీటినుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకు భారత్ ప్రయత్నిస్తోందని పాక్ రాజకీయ నాయకులు ఆరోపించారు. 56 ఏళ్ల క్రితం నాటి సింధు నదీ జలాల ఒప్పందంపై భారత్ పునఃసమీక్ష జరిపి, పాకిస్తాన్‌ను దారికి తెచ్చేందుకు ఈ ఒప్పందాన్ని ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉందని వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో భారత్ ఉద్దేశ్యాన్ని ఖండిస్తున్నట్లు వారు తెలిపారు.

చిత్రం.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశం అనంతరం విలేఖరులతో మాట్లాడుతున్న తెహ్రెక్-ఇ-ఇన్సాఫ్ ప్రతినిధి