అంతర్జాతీయం

ఉగ్రవాదుల కొమ్ము కాయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 6: ఉగ్రవాదం విషయంలో అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో మిలిటెంట్ల కొమ్ము కాయడం మానుకోవాలని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆర్మీని గట్టిగా హెచ్చరించినట్లు ప్రముఖ పాక్ దినపత్రిక ‘డాన్’ ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. సైన్యానికి పాక్ ప్రభుత్వం ఈ విధంగా హెచ్చరించడం అసాధరణంగా కూడా ఆ పత్రిక పేరొకంది. ఉరి సైనిక స్థావరంపై పాక్ ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై మెరపుదాడులు చేయడం, ప్రపంచ దేశాలన్నీ కూడా భారత సైన్యం జరిపిన దాడులను గట్టిగా సమర్థించిన నేపథ్యంలో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఉగ్రవాదుల విషయంలో చర్యలు తీసుకోవాలని భావిస్తూ ఉండడం గమనార్హం. పాక్ గడ్డపైనుంచి కార్యకలాపాలు జరుపుతున్న ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థలకు వత్తాసు ఇవ్వొద్దని, లేకుంటే అంతర్జాతీయంగా పాక్ ఏకాకి అయ్యే ప్రమాదం ఉందని షరీఫ్ సైన్యాన్ని హెచ్చరించినట్లు తెలుస్తోంది. సైన్యం, పలువురు ఉన్నతాధికారులతో పలుమార్లు సమావేశమైన తర్వాత షరీఫ్ ఆర్మీపై గతంలో ఎన్నడూ లేని విధంగా మండిపడినట్లు ఆ పత్రిక కథనం తెలిపింది. మంగళవారం అఖిల పక్ష సమావేశం జరగడానికి ఒక రోజు ముందు ఓ రహస్య ప్రదేశంలో జరిగిన సమావేశం ఫలితంగా కనీసం రెండు కార్యాచరణల పట్ల సైన్యం, ప్రభుత్వం మధ్య అంగీకారం కుదిరినట్లు ఆ కథనం పేర్కొంది. పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ రిజ్వాన్ అఖ్తర్, జాతీయ భద్రతా సలహాదారు(ఎన్‌ఎస్‌ఏ) నసీర్ జునేజాతో కలిసి నాలుగు రాష్ట్రాల్లోను పర్యటించి రాష్టస్థ్రాయి అపెక్స్ కమిటీలు, ఐఎస్‌ఐ సెక్టార్ కమాండర్లకు ఈ మేరకు ఒక సందేశం ఇస్తారని కూడా ‘డాన్’ కథనం పేర్కొంది. నిషేధించబడిన, లేదా ఇప్పటివరకు పౌర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అలవికాని మిలిటెంట్ గ్రూపులపైన చట్టాన్ని అమలు చేసే వ్యవస్థలు చర్యలు తీసుకున్న పక్షంలో జోక్యం చేసుకోవద్దని మిలిటరీ ఇంటెలిజన్స్ ఏజన్సీలకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది తొలి చర్య. అలాగే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి, అలాగే రావల్పిండిలోని యాంటీటెర్రరిస్టు కోర్టులో నిలిచిపోయిన 2008 నాటి ముంబయి దాడుల కేసు విచారణలను వీలయినంత త్వరగా ముగించడానికి చర్యలు తీసుకోవాలని కూడా షరీఫ్ సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సమావేశంలో పంజాబ్ రాష్ట్ర గవర్నర్ షాబాజ్ షరీఫ్, ఐఎస్‌ఐ చీఫ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఉగ్రవాదులపై ఎప్పుడు చర్యలు తీసుకున్నా సైన్యం జోక్యం చేసుకుని వారిని విడిపిస్తోందని షాబాజ్ షరీఫ్ ఆరోపించడం ఈ వాగ్వాదానికి కారణమైందని ఆ కథనం తెలిపింది.
కాగా, మంగళవారం జరిగిన అఖిల పక్ష సమావేశంలో విదేశాంగ కార్యదర్శి అజీజ్ చౌధురి ప్రధానమంత్రి కార్యాలయంలో ఎంపిక చేసిన ప్రభుత్వ, సైనిక అధికారులకు పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఏకాకి అవుతోందని, అమెరికాతో పాక్ సంబంధాలు దిగజారుతున్నాయని, జైషే మహమ్మద్‌పైన చర్య తీసుకోవాలని, పఠాన్‌కోట వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడులపై దర్యాప్తును త్వరగా పూర్తి చేయాలని అమెరికా కోరుతోందని అంటూ ఒక ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చారని కూడా ఆ కథనం పేర్కొంది. అయితే పాక్ ప్రధానమంత్రి కార్యాలయం డాన్ పత్రిక కథనాన్ని ఊహాజనితంగా, తప్పుదోవ పట్టించేదిగా పేర్కొంటూ, దానిలో ఎంతమాత్రం నిజం లేదని వ్యాఖ్యానించింది. పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా కూడాఈ కథనం కేవలం ఊహాజనితమైందని వ్యాఖ్యానించడం గమనార్హం.

‘్భరత్ తప్పుడు కథనాలు వ్యాప్తి చేస్తోంది’
ఇదిలా ఉండగా భారత్ పాక్‌కు సంబంధించి తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తోందని ఆ దేశపు ఆర్మీ చీఫ్ జనరల్ రషీల్ షరీఫ్ ఆరోపించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు జరుపుతున్న పోరాటానికి తిరుగులేని మద్దతు ఇస్తున్న ఒక దేశం గురించి భారతీయ సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తాము ఖండిస్తున్నామని కైబర్ ఫక్తూన్‌ఖ్వా రాష్ట్రంలోని రిసాల్‌పూర్‌లో ఉన్న పాకిస్తాన్ వైమానిక దళం (పిఏఎఫ్) క్యాడెట్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.