అంతర్జాతీయం

భారత్‌పై ట్రంప్ ప్రశంసల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎడిసన్ (న్యూజెర్సీ), అక్టోబర్ 16: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అమెరికాకు భారత్ ‘వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైన భాగస్వామి’ అని ఆయన అభివర్ణించారు. వచ్చే నెలలో జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే భారత్, అమెరికా మధ్య మైత్రీబంధం మరింత బలపడి ‘ఆప్తమిత్రులు’గా మారుతాయని, ఇరు దేశాలకు పరస్పరం ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటుచేసిన చారిటీ కార్యక్రమంలో ఇండో-అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎంతో శక్తిమంతుడని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు. ఆర్థిక సంస్కరణల వేగాన్ని పెంచడంతోపాటు అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయడం ద్వారా భారత్‌ను మోదీ అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నారని ట్రంప్ శ్లాఘించారు. భారత నాయకులు ఎంతో శక్తిమంతులని, అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తొలిసారి ఇండో-అమెరికన్లు నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు. భారత దేశంతోపాటు హిందుత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. ఇస్లామిక్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటం అభినందనీయమని ట్రంప్ కొనియాడారు. ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల అమెరికా కూడా ‘ఎంతో అప్రమత్తం’గా వ్యవహరించడంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని అమెరికాలోకి అనుమతించే ముందు క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.

చిత్రం.. రిపబ్లికన్ హిందూ కూటమి ఏర్పాటుచేసిన చారిటీ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్