అంతర్జాతీయం

ఓడినా ఒప్పుకోను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ వెగాస్, అక్టోబర్ 20: అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ఒక వేళ తాను ఓడినా ఓటమిని అంగీకరించేది లేదని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు. ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని ఆరోపించారు. అంతే కాదు, అధికార మార్పిడి కోసం అమెరికన్ డెమొక్రాటిక్ కనె్వన్షన్‌ను సాఫీగా జరగనివ్వకుండా చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. నవంబర్ 8న జరిగే అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి ప్రస్తుతం ఏమీ మాట్లాడేది లేదని, ఆ సమయానికి చూసుకుంటానని వివాదాస్పద డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
లాస్‌వెగాస్‌లోని నెవాడా యూనివర్శిటీలో హిల్లరీతో జరిగిన మూడో ముఖాముఖిలో ఎన్నికల ఫలితాలను మీరు అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు జవాబిస్తూ ‘‘ ఆ సమయంలో చెప్తాను. అప్పటిదాకా సస్పెన్స్‌లోనే ఉంచుతా’ అని అన్నారు. అంతే కాదు ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని మరోసారి ఆరోపించారు. ‘మీడియా నిజాయితీగా లేదు.. లంచగొండిగా మారింది. న్యూయార్క్ టైమ్స్ దీనిపై ఓ వ్యాసం కూడా ప్రచురించింది. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అయితే ఓటర్లు దీన్నంతా గమనిస్తున్నారు’’ అని ట్రంప్ అన్నారు. ‘‘ట్రంప్ వైఖరి అమెరికా రాజకీయాల వౌలిక సూత్రాలకు భంగకరంగా కనిపిస్తోంది. చట్టబద్ధంగా ఎన్నికైన వ్యక్తికి సాఫీగా అధికార మార్పిడి జరగాలంటే ఓడిపోయిన వ్యక్తి తన ఓటమిని హుందాగా అంగీకరించి అందుకు దోహద పడాల్సి ఉంటుంది. అమెరికా రాజకీయాల్లో ఇది చాలా ముఖ్యం. ఎన్నికల ఫలితాలను అంగీకరించననటం దారుణమని, అమెరికా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చి మాట్లాడుతున్నారని హిల్లరీ వ్క్యానించారు. ప్రతిసారీ అన్ని విషయాలు తాను అనుకున్నట్లుగా జరగటం లేదని ఆందోళన చెందుతున్నారు. ఏం జరిగినా అది తనకు వ్యతిరేకంగా రిగ్గింగ్ జరగటమేనంటున్నారు’’ అని ఆమె అన్నారు. ఇది 240 సంవత్సరాల మన ప్రజాస్వామ్యం పనిచేసే విధానం కాదని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యర్థి మనకు నచ్చినా, నచ్చకపోయినా ఫలితాలను స్వాగతించటం మన సంప్రదాయమని హిల్లరీ వ్యాఖ్యానించారు.
నాకు మహిళలంటే గౌరవం
* డిబేట్‌లో ట్రంప్ వ్యాఖ్య
* గొల్లుమన్న సభికులు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జరిగిన మూడో బిగ్ డిబేట్‌లో ఓ ఆసక్తికర పరిమాణం చోటుచేసుకుంది. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వాళ్లను అవమానిస్తూ వచ్చిన రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌‘మహిళలను నేను గౌరవించినంతగా ఎవరూ గౌరవించరు’అని అనడంతో సభికులు గొల్లుమన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మోడరేటర్ జోక్యం చేసుకుంటూ అందర్నీ ఆపాల్సి వచ్చింది.తనపై వచ్చిన లైంగిక దాడుల ఆరోపణలు అన్నీ అవాస్తవాలని పేర్కొన్న ట్రంప్ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భర్త బిల్‌క్లింటన్ వ్యవహారాలు ప్రస్తావించారు. మహిళల పట్ట బిల్ క్లింటన్ అనుచితంగా ప్రవరించారని అందుకు హిల్లరీనే బాధ్యురాలిని చేయాలని అన్నారు.