అంతర్జాతీయం

హిల్లరీ గెలిస్తే.. ఐఎస్‌కు ఊతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, అక్టోబర్ 22: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలిస్తే మరో నాలుగేళ్ల పాటు బరాక్ ఒబామా పాలన కొనసాగినట్టేనని, ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ విస్తరిస్తుందని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఉత్తర కరోలినాలో శుక్రవారం ఆయన ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ హిల్లరీ క్లింటన్ గెలిస్తే ఒబామాకేర్ (అధ్యక్షుడు ఒబామా ప్రవేశపెట్టిన ఆరోగ్య సంరక్షణ పథకం)పై పెట్టుబడులను రెండింతలు, మూడింతలు పెంచాలనుకుంటున్నారని, ఫలితంగా మీరు చెల్లిస్తున్న పన్నులు పెరుగుతాయని ఆయన అమెరికా ప్రజలను హెచ్చరించారు. ఒబామాకేర్‌ను రద్దు చేసి, దాని స్థానంలో మరో పథకాన్ని ప్రవేశపెట్టవలసి ఉందని ఆయన పేర్కొన్నారు. తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే అమెరికా ప్రజల ఉద్యోగాలను విదేశీయులు కొల్లగొట్టకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటామని, స్వదేశంలో వస్తువుల ఉత్పత్తిని పెంచుతామని ట్రంప్ పేర్కొన్నారు. వాణిజ్య పరమైన అన్ని అంశాలు ఒకేచోట పరిష్కారం కావడానికి ‘అమెరికన్ డెస్క్’ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అధిక వృద్ధిరేటు అవసరం
అమెరికా వృద్ధి రేటును భారతదేశ వృద్ధి రేటుతో పోల్చిన ట్రంప్ తాను అధ్యక్షుడిగా ఎన్నికయితే మన వృద్ధి రేటును 4శాతానికి పెంచుతానని, వచ్చే దశాబ్ద కాలంలో దేశంలో 25 మిలియన్ కొత్త ఉద్యోగాలు సృష్టిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. భారత్ 8శాతం వృద్ధి రేటును సాధించినా అక్కడి ప్రజలు సంతృప్తి చెందడం లేదని, అమెరికా, ఇక్కడి ప్రజలు మాత్రం అత్యల్పంగా ఒక్క శాతం వృద్ధి రేటే బాగుందని సంతృప్తి చెందుతున్నారని ఆయన అన్నారు. అమెరికా తిరిగి గొప్ప, పటిష్ఠమైన దేశం కావాలంటే అధిక వృద్ధిరేటు అవసరమని ఆయన పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యలతో విభేదిస్తున్న ఇవాంకా
న్యూయార్క్: డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ మరోసారి చర్చనీయాంశం అయ్యారు. ఇవాంకా ఒకవైపు రాజకీయంగా తన తండ్రికి మద్దతిస్తూనే, మరోవైపు ఆయన కొంత ఉద్రేకంతో, పరుషంగా మాట్లాడతారని భావిస్తూ ఆయన చేస్తున్న వ్యాఖ్యల నుంచి దూరం పాటిస్తున్నారు. దీనివల్ల ఇవాంకాకు తన తండ్రి ప్రత్యర్థులయిన డెమొక్రాట్ల నుంచి, రాజకీయ విశే్లషకుల నుంచి గౌరవం లభిస్తోంది. తాను ఓడిపోతే ఎన్నికల ఫలితాలను ఆమోదించబోనని తొలుత, తాను గెలిస్తేనే ఫలితాలను సంపూర్ణంగా ఆమోదిస్తానని తరువాత ప్రకటించటం ద్వారా ట్రంప్ అందరినీ విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. అయితే తొలుత మోడల్‌గా ఉండి తరువాత బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌గా మారిన ఇవాంకా మాత్రం ఫలితాలు ఎలా ఉన్నా వాటిని తన తండ్రి ఆమోదించాలని సూచించారు. మహిళల గురించి తాను గతంలో చేసిన వ్యాఖ్యలు ‘లాకర్-రూమ్ టాక్’గా ట్రంప్ సమర్థించుకోగా, ఇవాంకా మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు సరికావని, మహిళలను గాయపరిచేవిగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు తమను అసౌకర్యానికి గురిచేశాయని కూడా ఆమె పేర్కొన్నారు. త్వరలో 35 ఏళ్లు నిండనున్న ఇవాంకా ఇంకా తండ్రి సంరక్షణలోనే ఉన్నారు.