అంతర్జాతీయం

రష్యాలో కూలిన హెలికాప్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, అక్టోబర్ 22: రష్యాలో ఓ హెలికాప్టర్ కూలిపోయిన దుర్ఘటనలో 19 మంది మరణించారు. సైబీరియన్ రీజియన్‌లోని క్రాస్నోయార్క్స్ నుంచి నోవి ఉరెంగాయ్ నగరానికి 22 మందితో ఎంఐ-8 హెలికాప్టర్ వెళుతుండగా గత రాత్రి ప్రమాదం జరిగినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తూ ఉరెంగాయ్‌కు దాదాపు 80 కి.మీ దూరంలో నెట్‌వర్క్‌తో సంబంధాలు తెగిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. మిగతా 19 మంది మరణించినట్లు ధ్రువీకరించారు.