అంతర్జాతీయం

ఇస్లామాబాద్‌లో నిషేధాజ్ఞలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, అక్టోబర్ 27: దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో రెండు నెలల పాటు ర్యాలీలు, సభల నిర్వహణపై నిషేధం విధిస్తూ పాకిస్తాన్ ప్రభుత్వం గురువారం ఆదేశాలు జారీ చేసింది. నవాజ్ షరీఫ్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్‌లో నవంబర్ 2న ఆందోళన చేయడానికి ప్రణాళిక రూపొందించుకున్న తరుణంలో ప్రభుత్వం ఈ నిషేధాజ్ఞలు విధించింది. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్‌ను విధిస్తూ జిల్లా పాలనాయంత్రాంగం ఈ ఆదేశాలు జారీ చేసింది.
ఈ ఆదేశాల ప్రకారం ప్రజలు సభలు జరుపుకోవడానికి, ఆయుధాలను ప్రదర్శించడానికి వీలు లేదు. పాలనాయంత్రాంగం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అయిదుగురి కన్నా ఎక్కువ మంది వ్యక్తులు ఒకచోట గుమికూడటానికి వీలు లేదు. ప్రజల ర్యాలీలను, ప్రజలు ఒకచోట సమావేశం కావడాన్ని అధికారులు నిషేధించారని రేడియో పాకిస్తాన్ తెలిపింది. పనామా పత్రాలు లీకయిన నేపథ్యంలో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్, ఆయన కుటుంబ సభ్యులు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పిటిఐ) ఆరోపిస్తోంది. అందువల్ల షరీఫ్ ప్రధాని పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ నవంబర్ 2న ఇస్లామాబాద్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఇస్లామాబాద్‌లో రెండు నెలల పాటు నిషేధాజ్ఞలు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశ రాజధానిని స్తంభింపచేయకూడదంటూ పిటిఐని ఇస్లామాబాద్ హైకోర్టు ఆదేశించింది.