అంతర్జాతీయం

ఎఫ్‌బిఐ లేఖే కొంపముంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, నవంబర్ 13: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను పరాజయం పాలుకావడానికి ఎఫ్‌బిఐ డైరెక్టరే కారణమని డెమొక్రెటిక్ పార్టీ నాయకురాలు హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. తనపై దాఖలైన ఇమెయిళ్ల కేసును పునరుద్ధరించాలని ఎఫ్‌బిఐ నిర్ణయించడంవల్లే తాను ఘోర పరాజయాన్ని చవిచూసానని, లేనిపక్షంలో ఈ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని సాధించి ఉండేదాన్ననే హిల్లరీ వెల్లడించారు. రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై చివరి క్షణం వరకుకూడా అత్యంత అధిక్యతను కొనసాగిస్తున్న తాను అనుకున్న విజయాన్ని సాధించలేకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చని పేర్కొన్న హిల్లరి ‘‘ప్రధానంగా ఇమెయిళ్ల కేసును తిరగదోడాలని ఎఫ్‌బిఐ డైరెక్టర్ కోమె తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం’’ అని అన్నారు. ఇమెయిళ్ల కుంభకోణంపై తాము దర్యాప్తును మళ్లీ ప్రారంభిస్తున్నామని ఎఫ్‌బిఐ డైరెక్టర్ జేమ్స్ కోమె కాంగ్రెస్ నాయకత్వానికి లేఖ రాసేవరకు కూడా తాను తిరుగులేని ఆధిక్యతలోనే ఉన్నానని హిల్లరి గుర్తుచేశారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు క్లీన్‌చిట్ ఇచ్చినప్పటికి ప్రయోజనం లేకపోయిందన్నారు. మొదటి లేఖతోనే ట్రంప్ మద్దతుదారులకు కొత్త శక్తి వచ్చినట్లయిందని, తనకు క్లీన్‌చిట్ లభించినా వారి ఆధిక్యతే కొనసాగిందని వెల్లడించారు. చివరి క్షణంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఎంతగా ప్రయత్నించినా ఫలితాన్ని సాధించలేకపోయామన్నారు. ఫలితాన్ని మార్చే సామర్థ్యం కలిగిన రెండు రాష్ట్రాల్లో భారీగా పుంజుకోగలిగామని, కాని తమకు పట్టువున్న రాష్ట్రాలు ఆదుకోలేకపోవడంవల్లే ఓటమిపాలయ్యానని తెలిపారు.