అంతర్జాతీయం

అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబూల్, నవంబర్ 21: అఫ్గాన్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరగడంతో 28 మంది మృతిచెందారు. పశ్చిమ కాబూల్‌లో షియాలు ప్రార్థనలు చేస్తున్న మసీదులో ఆత్మాహుతి బాంబర్ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ సంఘటనలో మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. రెండస్థులున్న మసీదులోని కింది అంతస్థులో పేలుడు జరిగింది. ‘నేను మసీదులోనే ఉన్నారు. ఆ సమయంలో ముల్లా ప్రార్థనలు చదువుతున్నాడు. ఒక్కసారిగా పెద్దశబ్దంతో పేలుడు సంభవించింది.. అనంతరం అంతా చీకటే మిగిలింది’ అని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇజాజ్ అలి విలేఖరులకు తెలిపాడు. అఫ్గాన్ మసీదుల్లో ప్రార్థనలు జరుగుతున్నప్పుడు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడడం ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయని పోలీసు అధికారి తెలిపారు.