అంతర్జాతీయం

సర్తాజ్ అజీజ్‌తో మోదీ కరచాలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, డిసెంబర్ 4: పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వచ్చిన పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్‌తో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరచాలనం చేశారు. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న నేపథ్యంలో మోదీ, సర్తాజ్ అజీజ్ కరచాలనం చేసుకోవడంతోపాటు ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య మర్యాదపూర్వకంగా సాగిన సంభాషణలను పాక్ ప్రచార మాధ్యమాలు ఆదివారం ప్రముఖంగా ప్రస్తావించాయి. సర్తాజ్ అజీజ్ శనివారం సాయంత్రమే అమృత్‌సర్‌కు చేరుకున్నారు. ఈ సదస్సుకోసం వివిధ దేశాలనుంచి వచ్చిన ప్రతినిధులకు మోదీ శనివారం రాత్రి విందు ఏర్పాటు చేశారు. అజీజ్ షెడ్యూలు మారడంతో ఈ విందులో ఆయనకు మోదీతో కరచాలనం చేసే అవకాశం లభించింది. దీంతో ‘అజీజ్-మోదీ హ్యాండ్‌షేక్ సెట్స్ ఆఫ్ మీడియా ఫ్రెంజీ’ అనే శీర్షికతో ‘ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ పత్రిక తమ తొలి పేజీలో ప్రముఖంగా వార్తను ప్రచురించింది.
సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు తారస్థాయికి చేరి భారత్, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇరు దేశాల అధికారులు కరచాలనం చేసుకుని మీడియా దృష్టిని ఆకర్షించారని, హార్ట్ ఆఫ్ ఆసియా సదస్సు కోసం విచ్చేసిన ప్రతినిధులకు విందు ఏర్పాటు చేసిన మోదీ చిరునవ్వుతో అజీజ్‌తో కరచాలనం చేయడంతోపాటు లండన్‌లో ఇటీవల ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్స చేయించుకున్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోగా, మోదీకి నవాజ్ తరఫున అజీజ్ శుభాకాంక్షలు తెలియజేశారని ఆ పత్రిక పేర్కొంది.