అంతర్జాతీయం

శంషాబాద్‌లో ఆగిపోయిన హాంగ్‌కాంగ్ విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 8: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సాంకేతిక లోపంతో క్యాత్య పసిఫిక్ విమానం నిలిచిపోయింది. సిఎక్స్ 646 పసిఫిక్ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి హాంగ్‌కాంగ్ వెళ్లాల్సి ఉంది. కాగా విమానంలో సాంకేతిక లోపంత తలెత్తడంతో తిరిగి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే విమానాన్ని ల్యాండ్ చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున బయల్దేరాల్సిన విమానం ఆలస్యం కాగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
భారీగా పాత నోట్లు
కాగా, ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి భారీగా పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఓ వ్యక్తి నుంచి రూ. 10,16,300 విలువైన పాత నోట్లు స్వాధీనం చేసుకున్నారు. మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.