అంతర్జాతీయం

కొరియా అధ్యక్షురాలి అభిశంసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, డిసెంబర్ 9: అధికార దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గియున్-హై అభిశంసనకు గురయ్యారు. శుక్రవారం ఆమెపై ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని దక్షిణ కొరియా జాతీయ అసెంబ్లీ ఆమోదించింది.
ఓటింగ్ అనంతరం పార్క్ గియున్ అధికారాలన్నిటినీ తొలగిస్తూ అధికార పత్రాలను అధికారులు అధ్యక్ష భవనానికి అందజేశారు. ఆమెను శాశ్వతంగా తొలగించాలా వద్దా అనే విషయాన్ని దేశ రాజ్యాంగ న్యాయస్థానం నిర్ణయించే దాకా ప్రధాని హ్వాంగ్ క్యో అహన్‌కు ఆమె అధికారాలన్నిటినీ దఖలు పరిచారు. దీనిపై నిర్ణయం ప్రకటించడానికి రాజ్యాంగ న్యాయస్థానానికి ఆరునెలలు గడవు ఇచ్చారు. తన నిర్లక్ష్యం, దేశం భద్రతాపరంగా, ఆర్థికంగా కష్టాలు ఎదుర్కొంటున్న సమయంలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోయిన కారణంగా తలెత్తిన ఈ రాజకీయ కుదుపును దేశం ఎదుర్కోవలసి వచ్చినందుకు తాను దేశవ ప్రజలకు క్షమాపణలు చెప్తున్నానని ఓటింగ్ అనంతరం కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ పార్క్ అన్నారు.
తమ పార్టీకి తిరుగులేని విజయాలు సాధించిపెట్టినందుకు ఒకప్పుడు క్వీన్ ఆఫ్ ఎలక్షన్స్‌గా అభివర్ణించబడిన పార్క్ ఇటీవలి కాలంలో తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం తెలిసిందే. దీనిపై ఆగ్రహించిన దేశ ప్రజలు లక్షలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసనలకు సైతం దిగారు. ఈ నేపథ్యంలో జాతీయ అసెంబ్లీలో ఆమెపై అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆమెకున్న అధికారాలన్నిటినీ తొలగిస్తూ, వాటిని ప్రధానికి బదిలీ చేస్తూ జాతీయ అసెంబ్లీలో తీర్మానించారు. కాగా, అభిశంసన తీర్మానాన్ని ఆమోదించాలని డిమాండ్ చేస్తూ దాదాపు పది వేల మంది జాతీయ అసెంబ్లీ ముందు శుక్రవారం ప్రదర్శన చేశారని కూడా ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. రాజ్యాంగ న్యాయస్థానంలోని తొమ్మిది మంది జడ్జీల్లో కనీసం ఆరుగురు పార్క్ అభిశంసనను సమర్థించినట్లయితే ఆమెను అధికారికంగా తొలగిస్తారు. ఆ తర్వాత 60 రోజుల్లోగా అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు.