అంతర్జాతీయం

అమెరికా విదేశాంగ మంత్రిగా టిల్లెర్సన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 11: అమెరికా తదుపరి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో విదేశాంగ మంత్రి పదవిని ఎక్సాన్ మొబైల్ సంస్థ సిఇఓ రెక్స్ టిల్లెర్సన్‌కు కట్టబట్టే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తదుపరి ప్రభుత్వంలో ఈ పదవిని ఆశిస్తున్న వారిలో టిల్లెర్సన్ అందరికంటే ముందున్నాడు. దీంతో ఆయననే ఈ పదవికి ఎంపిక చేయాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టిల్లెర్సన్‌కు ఎం తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, కనుక ఈ పదవిని టిల్లెర్సన్‌కు కట్టబెట్టే ముందు ఆయన నామినేషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాల్సి వస్తుందని రిపబ్లికన్ పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్ సెనేటర్లు హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికీ ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విదేశాంగ మంత్రి పదవిని ఎవరికి అప్పగించబోతున్నారన్నదానిపై ఈ వారంలోనే తుది ప్రకటన వెలువడుతుందని అందరూ భావిస్తున్నారు.