అంతర్జాతీయం

తాలిబన్, హక్కానీలకు పాకిస్తాన్ స్వర్గ్ధామం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 17: అఫ్గానిస్తాన్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు సాగించే తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్‌లాంటి గ్రూపులు పాకిస్తాన్ భూభాగం లోపలినుంచి స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని, అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ పేర్కొంది. తాలిబన్, హక్కానీ నెట్‌వర్క్ సీనియర్ నాయకత్వంసహా అఫ్గాన్‌కు చెందిన ఉగ్రవాద ముఠాలు పాకిస్తాన్ భూభాగంలోని సురక్షితమైన స్థావరాలనుంచి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని పెంటగాన్ అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన ఆరునెలల నివేదికలో పేర్కొంది. అంతేకాదు ఈ నివేదిక సమయంలో హక్కానీ నెట్‌వర్క్ ముప్పులను దెబ్బతీసే చర్యలేవీ పాకిస్తాన్‌వైపునుంచి కనిపించలేదని కూడా ఈ ఏడాది నవంబర్‌తో ముగిసిన కాలానికి సంబంధించిన ఆ నివేదికలో తెలిపింది.