అంతర్జాతీయం

పపువా న్యూ గినియాలో పెను భూకంపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, డిసెంబర్ 17: పపువా న్యూ గినియా దీవుల్లో శనివారం పెను భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.9 పాయింట్ల తీవ్రత కలిగి ఉన్న ఈ భూకంపం తాకిడికి సునామీ వచ్చే ప్రమాదం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం, యుఎస్ జియలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) పలు దేశాలను హెచ్చరించాయి. పపువా న్యూ గినియాతో పాటుగా ఇండోనేసియా, నౌరు, సోలోమన్ దీవుల తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని ఆ కేంద్రాలు హెచ్చరించాయి. న్యూజిలాండ్ సివిల్ డిఫెన్స్ మంత్రిత్వ శాఖ కూడా దేశంలోని తీరప్రాంతాలన్నిటికీ సునామీ హెచ్చరికలు చేసింది. న్యూ ఐర్లాండ్‌లోని టారోన్‌కు తూర్పుగా 60 కిలోమీటర్ల దూరంలో స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.51 గంటలకు సముద్రం అడుగున 75 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించినట్లు యుఎస్‌జిఎస్ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి వివరాలు తెలియరాలేదు.