అంతర్జాతీయం

నా విజయం వెనుక ఇండో-అమెరికన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, డిసెంబర్ 17: అమెరికా అధ్యక్ష పదవికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తాను విజయం సాధించడం వెనుక ఇండో-అమెరికన్లు కూడా గణనీయమైన పాత్ర పోషించారని ఆ దేశ తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. ఫ్లోరిడాలోని ఓర్లాండోలో ‘్ధన్యవాద రాలీ’కి హాజరైన వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ, తన విజయానికి హిందువులు ఎంతగానో కృషి చేశారని, ఇప్పుడు వారంతా ఈ ర్యాలీలో తనవెంటే ఉన్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ట్రంప్ కీలక రాష్ట్రాల్లో ఒకటైన ఫ్లోరిడాలో కూడా విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఫ్లోరిడా ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు ట్రంప్ నిర్వహించిన ర్యాలీకి ప్రవాస భారతీయులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను సాధించిన చరిత్రాత్మక విజయం వెనుక ఇండో-అమెరికన్లు, ప్రత్యేకించి హిందువుల పాత్ర కూడా ఉందని ట్రంప్ అంగీకరించడం ఇదే తొలిసారి.

చిత్రం..ఓర్లాండోలో నిర్వహించిన ర్యాలీలో అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడుగా ఎన్నికైన మైక్ పెన్స్