అంతర్జాతీయం

నెత్తురోడిన ‘అడెన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెన్, డిసెంబర్ 18: యెమన్‌లోని అడెన్ నగరంలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో కనీసం 48 మంది సైనికులు చనిపోగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని, సైనిక, వైద్య వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఆత్మాహుతి దాడి తమ పనేనని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దేశంలోని రెండవ పెద్ద నగరమైన అడెన్‌లో ఇటీవలి కాలంలో సైనికులపై ఆత్మాహుతి దాడి జరగడం ఇది రెండోసారి. అడెన్‌లోని అల్-అరిష్ జిల్లాలో అల్-సావ్లాబన్ సైనిక స్థావరం వద్ద ప్రత్యక భద్రతా దళాల అధిపతి కల్నల్ నాసర్ సరియా నివాసం వద్ద జీతాలు తీసుకోవడానికి సైనికులు క్యూలో నిలబడి ఉన్నప్పుడు వారిలో చేరిపోయిన మానవ బాంబు తనను తాను పేల్చేసుకున్నట్లు ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. మృతుల సంఖ్య 48ని దాటిపోయిందని గాయపడిన వారి సంఖ్య 50 దాకా ఉందని అడెన్ వైద్య అధికారి అబ్దెల్ నాసెర్ అల్ వలీ చెప్పారు. ఇసుక మైదానంలో రక్తపు మరకలు, చెల్లాచెదరుగా పడి ఉన్న చెప్పులు, అవయవాల శకలాలతో బీభత్సంగా ఉన్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. ఈ దాడి తామే జరిపినట్లు ఐఎస్ ఉగ్రవాద సంస్థ తెలిపింది. అడెన్‌లో వారం రోజుల వ్యవధిలో సైనికులపై జరిగిన రెండో దాడి ఇది. ఎనిమిది రోజుల క్రితం కూడా సైనికులపై ఇలాంటి ఆత్మాహుతి దాడి జరిగి 48 మంది సైనికులు చనిపోగా, 29 మంది గాయపడ్డారు.

చిత్రం..అడెన్ నగరంలో ఆదివారం ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం