అంతర్జాతీయం

ఉగ్రవాదం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటికన్ సిటీ, డిసెంబర్ 25: క్రైస్తవుల పవిత్రమైన పండుగ క్రిస్మస్‌ను పురస్కరించుకొని పోప్ ఫ్రాన్సిస్ ఆదివారం వాటికన్ సిటీలో చేసిన ప్రసంగంలో ఉగ్రవాద బాధితుల కుటుంబాలను గురించి ప్రస్తావించారు. కొద్ది రోజుల క్రితం బెర్లిన్ మార్కెట్‌లో ఉగ్రవాదులు జరిపిన ట్రక్కు దాడిలో 12 మంది మృతిచెందిన నేపథ్యంలో ఆయన వాటికన్‌లో సంప్రదాయంగా ఇచ్చే ‘ఉర్బి ఎట్ ఒర్బి) (నగరం మరియు ప్రపంచం) సందేశంలో వేలాది మంది ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉగ్రవాదం వల్ల ఎందరో అసువులు బాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడుల్లో ఆత్మీయులను, కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ఉగ్రవాదం కారణంగా అనేక దేశాలు, నగరాలలో భయంతో నిండిన గుండెలతో బతుకులీడుస్తున్న ప్రజలకు శాంతి చేకూరాలని కోరారు. సిరియాలో యుద్ధం సమసిపోవాలని ఆయన కోరారు. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఎంతో రక్తపాతం చిందిందని ఆయన పేర్కొన్నారు. యుద్ధాన్ని శాశ్వతంగా నిలిపివేయవలసిన సమయం ఆసన్నమయిందని, అంతర్జాతీయ సమాజం క్రియాశీలకంగా వ్యవహరించి చర్చల ద్వారా ఈ సంక్షోభానికి పరిష్కారాన్ని కనుగొనాలని ఆయన ఆకాంక్షించారు.