అంతర్జాతీయం

ఇండోనేసియా పడవలో మంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జనవరి 1: ఇండోనేసియా రాజధాని జకార్తా సమీపంలో ఆదివారం ప్రయాణికులతో వెళ్తున్న ఓ పడవలో మంటలు చెలరేగడంతో కనీసం 23 మంది చనిపోగా, మరో 17 మంది జాడ తెలియడం లేదని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం సుమారు 200 మంది ప్రయాణికులతో ఈ పడవ జకార్తానుంచి పర్యాటక కేంద్రమైన టిడుంగ్ దీవికి వెళ్తుండగా మంటలు చెలరేగాయని జాతీయ విపత్తుల నిర్వహణ ఏజన్సీ తెలిపింది. 194 మందిని కాపాడినట్లు ఆ ఏజన్సీ ప్రతినిధి సుటోపో పుర్వో నుగ్రోహో ఎఎఫ్‌పి వార్తాసంస్థకు చెప్పారు. బోటులో దాదాపు వంద మంది ఉన్నట్లు బోటు ప్రయాణికుల జాబితా చెప్తున్నప్పటికీ, అది తప్పయి ఉండవచ్చని, అందువల్ల తాము ఇంకా గాలింపు జరుపుతున్నామని ఆయన చెప్పారు. మంటల్లో పడవ పూర్తిగా కాలిపోయినప్పటికీ అది ఫైబర్ బోటు కావడం వల్ల మునిగి పోలేదని అధికారులు చెప్పారు. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విదేశీయులేనని కూడా వారు చెప్పారు.

చిత్రం..అగ్ని ప్రమాదానికి గురైన బోటు వద్ద సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది