అంతర్జాతీయం

‘రాజకీయ రాయబారుల’కు గ్రేస్ పీరియడ్ ఇవ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 6: పదవి నుంచి దిగిపోతున్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో రాజకీయ నియామకాలలో భాగంగా నియమితులయిన రాయబారుల పదవీకాలాన్ని ప్రారంభోత్సవ దినం (ఇనాగరేషన్ డే) తరువాత పొడిగించకూడదని కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ నిర్ణయించింది. అమెరికాలో గతం నుంచీ కొనసాగుతున్న సంప్రదాయానికి భిన్నంగా రాయబారులకు ఎలాంటి అదనపు కాల పరిమితి (గ్రేస్ పీరియడ్) ఇవ్వకూడదని ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో గల అమెరికా రాయబారుల పోస్టులు ఖాళీ కానున్నాయి. జనవరి 20న జరిగే ప్రారంభోత్సవ దినంలోపు వీరంతా ఆ పదవుల నుంచి దిగిపోవలసి ఉంటుంది. అంటే జనవరి 20 తరువాత కొన్ని నెలల పాటు ఈ రాయబారుల పదవులు ఖాళీగా ఉంటాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి కొత్త రాయబారులను నియమించే వరకు ఈ పోస్టులు ఖాళీగానే ఉంటాయి. ఒబామా రాజకీయపరంగా నియమించిన రాయబారులకు పదవీకాలం విషయంలో ఎలాంటి మినహాయింపులు ఇవ్వబోమని ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్ అమెరికా విదేశాంగ శాఖకు ఇదివరకే తెలియజేసినట్లు ‘ద పొలిటికో’ ఒక వార్తాకథనాన్ని ప్రచురించింది. జనవరి 20లోగా పదవుల నుంచి వైదొలగాలని సూచిస్తూ విదేశాంగ శాఖ నిరుడు డిసెంబర్ 21నుంచే రాయబారులకు వ్యక్తిగతంగా సమాచారం పంపిస్తోందని తెలిపింది. ఈ విషయాన్ని ట్రంప్ ట్రాన్సిషన్ టీమ్‌లోని ఉన్నత స్థాయి వర్గాలు కూడా ధ్రువీకరించాయి. అయితే ఈ నిర్ణయం ప్రభావం ఎంతమంది దౌత్యవేత్తలపై పడుతుందో ఆ వర్గాలు స్పష్టంగా చెప్పలేదు. రెండు దఫాలుగా అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన ఒబామా తన పదవీకాలంలో వందలాది మందిని రాయబారులుగా నియమించారు. ఇందులో సుమారు 30 శాతం మందివి రాజకీయ నియామకాలే. సాధారణంగా వీరి నియామకానికి సెనేట్ ధ్రువీకరణ అవసరం ఉంటుంది.