అంతర్జాతీయం

‘జెట్’ స్పీడ్‌లో మరింత ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జనవరి 8: తమ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత ఊపునిచ్చే ఉద్దేశంతో భారత్, ఫ్రాన్స్ ఆదివారం రక్షణ, ఉగ్రవాదం సహా వివిధ అంశాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపాయి. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు ఇక రఫాలే జెట్ స్పీడ్‌లో ముందుకు సాగాలని ఫ్రెంచ్ పక్షం ఆకాక్షించింది. ఆదివారం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్-మార్క్ ఆరాల్ట్ మధ్య జరిగిన చర్చల్లో ఇరువురు నేతలు అంతర్జాతీయ ఉగ్రవాదంపై లోతుగా చర్చించారు. రెండు దేశాల భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై తాను ప్రధాని మోదీతో చర్చించినట్లు సమావేశం అనంతరం జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ జీన్-మార్క్ అన్నారు. ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొనడానికి ప్రధాని బెంగళూరుకు వచ్చినప్పుడు ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి ఆయనతో చర్చలు జరిపారు. భారత్ తనను తాను కాపాడుకోవలసిన అవసరం ఉంది గనుక తాము రక్షణ గురించి ప్రధానంగా మాట్లాడామని, ఇది తమ ద్వైపాక్షిక సంబంధాల్లో అత్యంత ముఖ్యమైన అంశమన్నారు. ఉగ్రవాదానికి సంబంధించిన అంశాలపై కూడా తాను మోదీతో మాట్లాడానని చెప్పారు. తమ రెండు దేశాలు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న తీరుపైనా చర్చించామన్నారు. భారత్‌కు పలు రకాల రక్షణ అవసరాలున్నాయని, రఫాలే యుద్ధ విమానాలతో పాటుగా దానికి జలాంతర్గాములు, హెలికాప్టర్లు కూడా కావాలని, అందుకే తాము వీటన్నిటిపైనా చర్చించామని చెప్పారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడు రఫాలే స్పీడ్‌తో ముందుకు సాగాలని ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి ఆకాంక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. ఇరువురు నేతలు పౌర అణు విద్యుత్ రంగంలో సహకారంపైన ప్రదానంగా జైతాపూర్ అణు విద్యుత్ కేంద్రంపై చర్చలు జరిపారని ఆయన చెప్పారు.

చిత్రం..బెంగళూరులో ఆదివారం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-మార్క్ ఆరాల్ట్‌తో
సమావేశమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ