అంతర్జాతీయం

‘లా లా ల్యాండ్’కు గ్లోబ్ అవార్డుల పంట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జనవరి 9: హాలీవుడ్ సినిమా ‘లా లా ల్యాండ్’ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఏకంగా ఏడు ట్రోఫీలను ఎగరేసుకు పోయింది. నామినేట్ అయిన అన్ని విభాగాల్లోనూ ట్రోఫీలను గెలుచుకోవడం ద్వారా ఈ సినిమా వచ్చేనెలలో ప్రకటించనున్న ఆస్కార్ పురస్కారాల రేసులో అగ్రభాగాన నిలిచింది. ఆదివారం రాత్రి జరిగిన పురస్కారాల ప్రదానోత్సవంలో ఈ ఏటి మేటి ప్రేమకథా చిత్రంగా ‘లా లా ల్యాండ్’ గౌరవాన్ని పొందింది. ఉత్తమ హాస్యం/సంగీతం విభాగంలో ఈ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రంలో ప్రధాన జంట ర్యాన్ గోస్లింగ్, ఎమ్మా స్టోన్ తమ ఉత్తమ నటనకు గ్లోబ్ పురస్కారాలను గెలుచుకున్నారు. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం విభాగంలో డామియెన్ చాజెల్లీ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. పాటల విభాగంలోనూ ఉత్తమ చిత్రంగా ‘లా లా ల్యాండ్’ నిలిచింది. ‘లా లా ల్యాండ్’ తరువాత ఎక్కువ అవార్డులను ‘మూన్‌లైట్’ గెలుచుకుంది. డ్రామా విభాగంలో ఉత్తమ చిత్రంగా ఇది నిలిచింది.
గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఈ ఏటి సెసిల్ బి డిమిల్లె అవార్డు గ్రహీత స్ట్రీప్ తన ప్రసంగంలో రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. ఎంతో భావోద్రేకంతో మాట్లాడిన స్ట్రీప్ అందరినీ కలుపుకొని పోవాలని విజ్ఞప్తి చేశారు. ట్రంప్ బహిరంగంగా ఒక వికలాంగ రిపోర్టర్‌ను ఎగతాళి చేశారని ఆరోపించారు. ‘ఈ సంఘటన చూసిన నా హృదయం ద్రవించింది. ఇప్పటికీ దానిని మరచిపోలేక పోతున్నాను. ఎందుకంటే అది ఒక సినిమాలోని సన్నివేశం కాదు. అది నిజ జీవితంలో జరిగిన సంఘటన’ అని ఆమె అన్నారు. హాస్యం/సంగీతం విభాగంలో ఉత్తమ నటుడు అవార్డు పొందిన గోస్లింగ్ మాట్లాడుతూ తన పార్ట్‌నర్ ఎవా మెండెస్ పోషించిన పాత్రను ప్రశంసించారు.

చిత్రం..‘మూన్‌లైట్’ చిత్ర యూనిట్ సభ్యులు