అంతర్జాతీయం

మన చంద్రుడి వయసు 4.51 బిలియన్ సంవత్సరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జనవరి 13: భూమికి ఉపగ్రహమైన చంద్రుడి వయసు ఎంత? అనే దానిపై శాస్తజ్ఞ్రుల్లో ఇప్పటికీ తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూనే ఉంది. అయితే చంద్రుడి వయసు కనీసం 4.51 బిలియన్ సంవత్సరాలని, ఇది ఇంతకు ముందు అనుకున్న దానికన్నా 14 కోట్ల సంవత్సరాలు ఎక్కువ అని తాజాగా జరిపిన పరిశోధనలో వెల్లడయింది. 1971లో చంద్రుడిపైకి అమెరికా పంపిన అపోలో-14 ఉపగ్రహం చంద్రుడి ఉపరితలంనుంచి భూమికి తీసుకు వచ్చిన జిర్కాన్‌లు అనే ఖనిజాలపై జరిపిన తాజా పరిశోధన ద్వారా ఈ విషయం స్పష్టమయిందని అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న కాలిఫోర్నియా యూనివర్శిటీలో భౌతిక రసాయనిక శాస్తవ్రేత్త మెలానీ బర్బోనీ తెలిపారు.
తొలి దశ భూమి, ‘్థయా’ అనే గ్రహాల పిండం పరస్పరం తీవ్రస్థాయిలో ఢీకొనడం వల్ల చంద్రుడు ఏర్పడ్డాడు. సౌర కుటుంబం ఆవిర్భావం తర్వాత ఆరు కోట్ల సంవత్సరాల తర్వాత మాత్రమే చంద్రుడు ఏర్పడ్డాడని ఈ తాజా పరిశోధన వల్ల అర్థమవుతుంది. అంతేకాదు,్భమి, మన సౌర కుటుంబం ఎలా ఏర్పడిందనే దాన్ని అధ్యయనం చేసేందుకు అవసరమైన కీలకమైన సమాచారంగా కూడా ఇది ఉపయోగపడుతుందని శాస్తజ్ఞ్రులు అంటున్నారు. అయితే ఇది చాలా కష్టమైన పనని, ఎందుకంటే భూమి థీయాతో ఢీకొనడానికి ముందు ఏం జరిగిందో శాస్తజ్ఞ్రులకు తెలియదని, అనంతరం జరిగిన ప్రధాన పరిణామాలన్నిటినీ గుదిగుచ్చి అప్పుడు ఏం జరిగిందో అంచనా వేయడానికి ఇప్పుడు ఈ సమాచారం ఎంతో తోడ్పడుతుందని భావిస్తున్నారు.
సాధారణంగా చంద్ర శిలల వయసును నిర్ధారించడం చాలా కష్టం. ఎందుకంటే వాటిలో చాలా శిలలు పలు ఇతర శిలల భాగాలతో కలిసి ఏర్పడినవై ఉంటాయి. అయితే బర్బోనీ సహజస్థితిలో ఉండే ఎనిమిది జిరికాన్‌లను విశే్లషించారు. భౌగోళిక చరిత్రను తెలియజేయడానికి జిరికాన్‌లు అత్యుత్తమమైనవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలోని జియో కెమిస్ట్రీ, కాస్మోకెమిఅస్టీ ప్రొఫెసర్ అయిన కెవిన్ మెకీగన్ అంటున్నారు. ఈ పరిశోధనా పత్రాన్ని ‘సైన్స్ అడ్వానె్సస్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.