అంతర్జాతీయం

కొత్త ఇంట్లోకి ఒబామా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 17: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా శే్వతసౌధం విడిచిపెట్టనున్నారు. దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీంతో ఒబామా కోసం ఏర్పాటుచేసిన నివాసంలోకి మారనున్నారు. బరాక్ ఒబామా గృహోపకరణాలతో వ్యాన్లు కొత్త ఇంటివద్ద కనిపించాయి. వైట్‌హౌస్ నుంచి కలోరమా ప్రాంతంలో ఒబామా కొత్త ఇంటికి వ్యాన్లు సామాన్లతో చేరుకున్నాయి. దీనికి సంబంధించిన చిత్రాలు సిబిఎస్ మీడియాలో దర్శనమిచ్చాయి. 8,200 చదరపుఅడుగుల స్థలంలో ఎనిమిది పడక గదుల ఇంటిని బరాక్ ఒబామాకోసం నిర్మించారు. త్వరలో అధ్యక్ష పీఠం నుంచి దిగిపోతున్న ఒబామా కొత్త గృహం ఫొటోలు విడుదలయ్యాయి. శే్వతసౌధం నుంచి వదలి వెళ్తున్నామన్న బాధ తమ కుటుంబానికి ఎంతమాత్రం లేదని ఒబామా ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు.