అంతర్జాతీయం

ట్రంప్‌కు చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 29: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఆ దేశ న్యాయమూర్తి ఒకరు స్పీడ్ బ్రేకర్ వేశారు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాలకు ప్రజలకు వ్యతిరేకంగా ట్రంప్ ఇచ్చిన అత్యంత వివాదాస్పద ఉత్తర్వులను న్యాయమూర్తి నిలుపుదల చేశారు. శరణార్థులను బలవంతంగా వారి దేశాలకు వెనక్కి పంపించి వేయటం, వీసాలు ఉన వారిని నిర్బంధించడం వంటి చర్యలను తక్షణం ఆపేయాలని ఆదేశాలిచ్చారు. న్యూయార్క్ జిల్లా న్యాయమూర్తి ఆన్ డొనెల్లీ ట్రంప్ శనివారం ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చారు. అమెరికన్ పౌర హక్కుల యూనియన్ దాఖలు చేసిన ఓ పిటిషన్‌పై ఆమె అత్యవసర ఉత్తర్వులను జారీ చేశారు. చట్టబద్ధమైన, అమల్లో ఉన్న వీసా ఉన్న వాళ్లెవ్వరినీ అడ్డుకోవటానికి వీల్లేదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ‘‘ అమెరికన్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ విభాగం ఆమోదించిన శరణార్థుల దరఖాస్తులు ఉన్నవారు, అమెరికా చట్టాల ప్రకారం అమలులో ఉన్న ఇమిగ్రేషన్, నాన్- ఇమిగ్రేషన్ వీసాలు కలిగి ఉన్నవాళ్లను, ఇరాక్, సిరియా, ఇరాన్, సూడాన్, లిబియా, సోమాలియా, యెమెన్ దేశాలకు చెందిన వారిలో చట్టబద్ధమైన వీసాలు కలిగి ఉంటే, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోజాలరు’’ అని విస్పష్టంగా పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ వివాదాస్పద ఇమ్మిగ్రేషన్ ఉత్తర్వులు ఇచ్చిన మరుక్షణం నుంచి అమెరికాలోని అన్ని విమానాశ్రయాలలో గందరగోళం నెలకొంది. ఉత్తర్వులు అమల్లోకి వస్తున్న క్షణంలోనే అమెరికాకు వచ్చిన నిషేధిత ఏడు దేశాల పౌరులను ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎక్కడికక్కడ విమానాశ్రయాల్లోనే నిర్బంధించారు. దీంతో దేశమంతటా అయోమయం ఏర్పడింది. ఇలా ఉన్నట్టుండి విమానాశ్రయంలోనే చట్టబద్ధంగా వీసాలు ఉన్నవారిని అడ్డుకోవటంతో తీవ్ర నిరసన వ్యక్తమయింది. దీంతో ఇద్దరు ఇరాక్ పౌరుల పక్షాన అమెరికన్ పౌర హక్కుల సంఘం అత్యవసర పిటిషన్‌ను న్యూయార్క్ జిల్లా కోర్టులో దాఖలు చేయటంతో న్యాయమూర్తి తక్షణం స్పందించారు. ఈ ఇద్దరు ఇరాకీలను జాన్ ఎఫ్ కెనె్నడీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవటమే కాకుండా వెనక్కి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో న్యాయమూర్తి డోనెల్లి ట్రంప్ ఉత్తర్వులపై ‘స్టేటస్ కో’ కొనసాగించాలంటూ అధికారులను ఆదేశించారు. చట్టబద్ధమైన అమెరికా వీసా ఉన్న ఇతర దేశస్థులను అమెరికాలోకి ప్రవేశించనీయకుండా వెనక్కి పంపించటం వారికి కోలుకోలేని దెబ్బ అని అన్నారు. అమెరికా ప్రజాస్వామ్య విలువలకు ఇది తీవ్రమైన విఘాతమవుతుందన్నారు. ‘‘చట్టపరంగా ఈ దేశంలోకి రావటానికి అన్ని అనుమతులు ఉన్న వారిని అక్రమంగా అమెరికానుంచి వెళ్ల గొట్టలేరు’’ అని స్పష్టంచేశారు. రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవటం వల్ల వందలాది శరణార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోనీ డి రొమెరో అన్నారు. సమానత్వంపై అధ్యక్షుడు ట్రంప్ యుద్ధం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలోకి ముస్లింలు రాకుండా ట్రంప్ విధించిన నిషేధం ఎంతోకాలం కొనసాగదని ఆయన స్పష్టం చేశారు.