అంతర్జాతీయం

అది నిషేధం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జనవరి 29: అమెరికాలో ప్రవేశించే శరణార్థులపై తీవ్రమైన ఆంక్షలు విధించడంతోపాటు ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఏడు దేశాల పౌరులను తమ దేశంలోకి రానీయకుండా నిషేధిస్తూ అగ్రరాజ్య అధినేత డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన వివాదాస్పద ఉత్తర్వుపై ఇంటా, బయటా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన ఏమాత్రం చలించడం లేదు. పైపెచ్చు ఆయన తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తన ఉత్తర్వు బాగానే పనిచేస్తోందని, ఇది ముస్లింలపై నిషేధం కాదని ట్రంప్ చెప్పుకున్నారు. ‘ఇది ముస్లింలపై నిషేధం కాదు. నేను జారీ చేసిన ఉత్తర్వు బాగానే పనిచేస్తోంది. కావాలంటే దేశంలోని విమానాశ్రయాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏమి జరుగుతోందో మీరే చూడండి’ అని ఆయన శనివారం విలేఖరులతో అన్నారు. ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న దేశాల పౌరులను అమెరికాలో ప్రవేశించకుండా అడ్డుకోవడమంటే వారిపై నిషేధం విధించడమేనన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. ‘ఇది ముస్లింలపై నిషేధం కాదు. అయినా మేము అన్నింటికీ సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన చెప్పారు. లాబీయింగ్‌ను నిషేధించడంతోపాటు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌ను ఓడించాలన్న ప్రణాళికకు, అలాగే జాతీయ భద్రతా మండలికి గుర్తింపునిచ్చేందుకు ఉద్దేశించిన మరో మూడు ఉత్తర్వులపై సంతకం చేసిన తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.